Saindhav Update: వెంకీ అభిమానులకు గుడ్ న్యూస్... సైంధవ్ టీజ‌ర్‌ డేట్, టైమ్ ఫిక్స్..

Saindhav Movie Update: వెంకటేష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ సైంధవ్. తాజాగా ఈ మూవీ టీజర్ కు సంబంధించిన కీలక అప్‌డేట్ ను ప్రకటించారు మేకర్స్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 15, 2023, 02:02 PM IST
Saindhav Update: వెంకీ అభిమానులకు గుడ్ న్యూస్... సైంధవ్ టీజ‌ర్‌ డేట్, టైమ్ ఫిక్స్..

Victory Venkatesh Saindhav Movie Update: విక్టరీ వెంకటేష్ (Daggubati Venkatesh) హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ సైంధవ్ (Saindhav). ఈ మూవీని సంక్రాంతి కానుకగా అంటే జనవరి 13న తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. హిట్ చిత్రాల ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వెంకీకి 75వ చిత్రం కావడం విశేషం. భారీ వ్యయంతో రూపొందిస్తున్న ఈ మూవీ నుంచి ఓ సాలిడ్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్.

సైంధవ్ టీజ‌ర్‌ను అక్టోబర్ 16న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా ప్రచార చిత్రానికి సంబంధించిన ఓ కీలక అప్‌డేట్ ను ఇచ్చారు చిత్రయూనిట్. ఈ మూవీ టీజ‌ర్‌ను రేపు ఉద‌యం 11:34 గంట‌ల‌కు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్‌ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే మిషన్‌ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో వెంకీ జోడిగా జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్‌ నటిస్తోండగా.. రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, జయప్రకాశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ఈ సినిమా ద్వారా నవాజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీ 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Also Read: Sai Dharam Tej Birth day: మాస్ అవతారంలో సాయిధరమ్ తేజ్.. 'గాంజా శంకర్‌' గ్లింప్స్‌ అదుర్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News