NY VFXWala on Adipurush: ఆ గ్రాఫిక్స్ మా పనికాదు.. మాకేం సంబంధం లేదంటూ బాలీవుడ్ హీరో సొంత సంస్థ క్లారిటీ..ఎవరు అబద్దం చెబుతున్నారు?

VFX company NY VFXWala Clarity on Adipurush’s Graphics: ఆదిపురుష్ సినిమా గ్రాఫిక్స్ మా పని కాదంటూ అజయ్ దేవగన్ కు చెందిన ఎన్వై వీఎఫ్ఎక్స్ వాలా క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే  

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 4, 2022, 09:55 AM IST
  • ఆ గ్రాఫిక్స్ మా పనికాదు..
  • మాకేం సంబంధం లేదంటూ బాలీవుడ్ హీరో సొంత సంస్థ క్లారిటీ..
  • ఎవరు అబద్దం చెబుతున్నారు?
NY VFXWala on Adipurush: ఆ గ్రాఫిక్స్ మా పనికాదు.. మాకేం సంబంధం లేదంటూ బాలీవుడ్ హీరో సొంత సంస్థ క్లారిటీ..ఎవరు అబద్దం చెబుతున్నారు?

VFX company NY VFXWala Clarity on Adipurush’s Graphics: బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాలు దాదాపు పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటించిన ఆది పురుష్ సినిమాకి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. అయితే ఈ టీజర్ చూసిన వారందరూ మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఈ సినిమా టీజర్ బాగుందని కామెంట్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం అసలు ఈ టీజర్ ఏంటి ? ఈ టీజర్ లో వాడిన విఎఫ్ఎక్స్ షాట్స్? ఏంటి అంటూ దారుణంగా విమర్శిస్తున్నారు.

ప్రభాస్ అభిమానులు కూడా ఈ టీజర్ అసలు ఏమీ బాలేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీవీ కార్టూన్స్ లో వాడే గ్రాఫిక్స్ తో ఈ టీజర్ నింపేశారని సినిమా కూడా ఇదే విధంగా ఉంటే కచ్చితంగా ప్రతికూల ఫలితం ఎదుర్కోక తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే అసలు ఈ సినిమాకి గ్రాఫిక్స్ చేసింది ఎవరు అనే విషయం మీద కూడా చర్చ జరుగుతుంది. తాజాగా అక్షయ్ కుమార్ కి సంబంధించిన యెన్వై విఎఫ్ఎక్స్ వాలా(NY VFXWala)అనే ఒక గ్రాఫిక్ సంస్థ తాము ఈ ఆది పురుష్ సినిమా గ్రాఫిక్స్ చేయలేదు అంటూ అధికారికంగా ప్రకటించింది.

అజయ్ దేవగన్ కు చెందిన ఈ గ్రాఫిక్స్ స్టూడియో ఇలా ఎందుకు స్పందించిందో అనే విషయం కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిజానికి ఈ గ్రాఫిక్ స్టూడియో అజయ్ దేవగన్ పెట్టుబడితో పెట్టింది అయినా దీని బాధ్యతలు అన్నీ ప్రసాద్ సుతార్ అనే వ్యక్తి చూసుకుంటున్నారు. ఆయన ఆదిపురుష్ నిర్మాతల్లో ఒకరని తాజాగా విడుదలైన టీజర్ ద్వారా క్లారిటీ వచ్చింది. ప్రసాద్ సుతార్ ట్విట్టర్ పేజీలో చెక్ చేస్తే ఆయన కవర్ ఫోటో ఆది పురుష్ టైటిల్ లోగో ఉంది.

దానికి తగ్గట్లుగానే ప్రసాద్ సుతార్ కూడా తన సోషల్ మీడియా వేదికగా అయోధ్య టీజర్ లాంచింగ్ ఈవెంట్ కు వెళ్లడం వెళుతున్నట్లుగా ట్వీట్ చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఆయనని టార్గెట్ చేసి ఇలాంటి చీప్ గ్రాఫిక్స్ ఎందుకు చేస్తున్నారు ప్రభాస్ పరువు తీయడానికే మీరంతా కంకణం కట్టుకున్నారా అంటూ ప్రసాద్ సుతార్ అకౌంట్ మీద కామెంట్లు వర్షం కురిపించడమే కాక పర్సనల్ మెసేజ్ లు కూడా పెడుతున్నారట.

ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా అది పురుష్ సినిమాలో నిర్మాతగా ప్రసాద్ సుతార్ వ్యవహరించిన సంగతి కరెక్టే కానీ ఆది పురుష్ సినిమా విఎఫ్ఎక్స్ విషయంలో తమకేమీ సంబంధం లేదని సదరు సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన జారీ చేసింది. అయితే నిజానికి ప్రసాద్ సుతార్ గతంలో తమ బృందం ఆదిపురుష్‌పై పని చేస్తోందని పేర్కొన్న అనేక చిత్రాలను తన సోషల్ మీడియాలో పంచుకున్నట్లు చెబుతున్నారు.

సుతార్ ట్విట్టర్ ప్రొఫైల్ హెడర్‌లో ఇప్పటికీ ఆదిపురుష్ లోగోనే ఉంది, కాబట్టి అసలు ఈ ప్రకటన ఎందుకు జారీ చేసిందో ఎవరికీ అర్ధం కావడం లేదు.అయితే ప్రభాస్ లాంటి ఫ్యాన్ ఇండియా స్టార్ సినిమాకి ఇలాంటి నాసిరకం గ్రాఫిక్స్ ఎందుకు చేశారనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దర్శకుడు ఓం రౌత్ అయినా ఇలాంటి గ్రాఫిక్స్ ముందే చూసుకోవాలి కదా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా భారీ బడ్జెట్ సినిమాలు చేసినప్పుడు కచ్చితంగా ఆ లెవల్ కు తగిన ఔట్పుట్ ఇవ్వాలి, తప్ప ఏదో ముహూర్తం బాగుంది కదా అని నాసిరకం అవుట్ ఫుట్ ఇస్తే ఆ ప్రభావం కచ్చితంగా సినిమా మీద పడే అవకాశం ఉంటుంది.

Also Read: Pawan Kalyan in God Father: గాడ్ ఫాదర్ సినిమాలో పవన్ కళ్యాణ్.. కన్వీనియంట్ గా దాచేసిన యూనిట్?

Also Read: Prabhas In Controversy: వివాదంలో ప్రభాస్.. పెదనాన్న పోయి నెల కూడా కాకుండానే పూజలా? ఇదేం పద్దతి?

Trending News