Venkatesh Maha Sensational Comments on KGF2: సినీ ప్రపంచంలో రోజుకు అనేక సినిమాలు తెర మీదకు వస్తూ ఉంటాయి. ఒకే భాష అని చెప్పలేం కానీ ప్రతిరోజు ఏదో ఒక భాషలో ఏదో ఒక సినిమా లేదా వెబ్ సిరీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలా విడుదలైన అన్ని సినిమాలు లేదా కంటెంట్ అంత అందరికీ నచ్చాలని లేదు. కానీ తాజాగా కేజిఎఫ్ 2 సినిమాని ఎద్దేవా చేస్తూ కేరాఫ్ కంచరపాలెం సినిమా డైరెక్టర్ వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాలా చేస్తున్నాయి.
అసలు విషయం ఏమిటంటే తాజాగా శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ, వెంకటేష్ మహా, నందిని రెడ్డి, మోహనకృష్ణ ఇంద్రగంటి కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వెంకటేష్ మాట్లాడుతూ ప్రపంచంలో ఏ తల్లి అయినా నువ్వు ఎప్పటికైనా గొప్పోడివి అవ్వరా, గొప్పోడు అంటే ఆమె దృష్టిలో బాగా సంపాదించి నలుగురికి ఉపయోగపడు అని అంటుంది. ఈ విషయంలో నాకు ఒక ప్రశ్న ఉంది, ఈ తల్లి ఏమి చెబుతుంది అంటే అంత గోల్డ్ కావాలి అంటుంది.
ఆ గోల్డ్ ను తవ్వి తీసే వాళ్లు ఉంటారు, ఈడు(హీరో) వెళ్లి వాళ్ళని ఉద్ధరిస్తాడు, తరువాత ఒక పాట వస్తుంది. లాస్టులో వచ్చి ఈడు మొత్తం బంగారం పోగేస్తాడు. ఆ తల్లి మహాతల్లిని నాకు కలవాలని ఉంటుంది ఎప్పుడైనా నిజంగా ఎవరైనా ఉంటే అన్నారు. ఆడు ఎంత నీచ్ కమీన్ కుత్తే కాకపోతే వాడు అంతా తీసుకెళ్లి లాస్టులో ఎక్కడో పార దొబ్బుతాడు, ఆడంత నీచ్ కమీన్ కుత్తే ఎవడైనా ఉంటాడా? అలాంటి కుత్తే అవ్వమని తల్లి అడిగితే, ఇలాంటి కథలను సినిమా తీస్తే మనం చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తున్నాం. కాదండీ ఇది ఒక సోషల్ డిస్కషన్ అండీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ క్రమంలో ఎక్కడా హీరో పేరు కానీ దర్శకుడు పేరు గానీ సినిమా పేరు కానీ మెన్షన్ చేయలేదు కానీ ఆయన చెప్పిన కథ ప్రకారం ఆయన చెప్పింది కేజీఎఫ్ 2 సినిమా గురించే అని అందరికీ అర్థం అయిపోతుంది.
ఇక ఇక్కడ కూర్చున్న ఐదుగురికి తెలుగులో మంచి క్రెడిబిలిటీ ఉందని ఆ క్రెడిబిలిటీ కనక పక్కన పెట్టి తాము కూడా పెన్ను పక్కన పెట్టి కత్తి పట్టుకుంటే వాళ్ళ కంటే ఎక్కువ హిట్లు కొట్టగలమంటూ కామెంట్లు చేశారు. అయితే వెంకటేష్ మహా వ్యాఖ్యలను ఎవరూ సమర్థించడం లేదు. కన్నడ సినీ పరిశ్రమ నుంచి ఆ సినీ పరిశ్రమ సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటిన సినిమాని ఇలా దారుణమైన రీతిలో విమర్శించడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు. నిజంగా అంత సత్తా ఉన్న వ్యక్తి అయితే సినిమా రిలీజ్ అయినప్పుడే రివ్యూలాగా రిలీజ్ చేసి ఉండవచ్చు కదా ఎప్పుడో అందరూ మర్చిపోయిన తర్వాత ఎందుకు దాని మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అని ప్రశ్నిస్తున్నారు. తెలుగు సినిమాలతో పోలిస్తే కేజిఎఫ్ 2 సినిమా బెటరే అని మనం వాళ్ళని ఎద్దేవా చేయాల్సిన స్థితిలో లేమని కౌంటర్లు వేస్తున్నారు. మరి మీ ఉద్దేశంతో కింద కామెంట్ చేయండి.
Also Read: Manchu Manoj Tributes: అత్తా మామలకు మంచు మనోజ్ నివాళులు..భార్యతో కలిసి భారీ కాన్వాయ్‌లో వెళ్లి!
Also Read: Venu Clarity on Copy Allegations: 'బలగం'పై కాపీ మరక.. డైరెక్టర్ వేణు ఏమంటున్నాడు అంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి