బాలీవుడ్ చిత్ర రీమేక్‌లో వెంకటేష్..?

Last Updated : Oct 8, 2017, 05:01 PM IST
బాలీవుడ్ చిత్ర రీమేక్‌లో వెంకటేష్..?

టాలీవుడ్ కథానాయకుడు వెంకటేష్ నటించిన అనేక చిత్రాలు హిందీలో రీమేక్ అయ్యాయి. చంటి, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం,  సూర్యవంశం లాంటి చిత్రాలు హిందీలో కూడా రీమేకై  అక్కడ కూడా విజయం సాధించాయి. ఆ తర్వాత వెంకటేష్ కూడా పలు బాలీవుడ్ రీమేక్స్‌లో నటించారు. గోపాల గోపాల, ఈనాడు, బాడీగార్డ్, గురు, మసాలా.. ఈ చిత్రాలన్నీ బాలీవుడ్ చిత్రాలకు రీమేక్‌లే. ఇప్పుడు వెంకటేశ్‌ మరో హిందీ రీమేక్‌లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా పేరే ఇర్ఫాన్‌ఖాన్‌  నటించిన ‘హిందీ మీడియం’. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని.. తెలుగులో రీమేక్‌ చేయడానికి దర్శకురాలు నందినిరెడ్డి  ప్రయత్నిస్తున్నారని.. అందులో ఇర్ఫాన్ పాత్ర కోసం వెంకటేశ్‌ను కలిశారని వార్తలు వస్తున్నాయి. హిందీలో చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన ‘హిందీ మీడియం’ చిత్రం దాదాపు 100 కోట్లను కలెక్ట్ చేసింది. తమ పాపను ఎలాగైనా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో చేర్చాలని భావించే తల్లిదండ్రులకు ఎదురైన కొన్ని అనుకోని ఘటనలు, వారు వాటిని ఎదుర్కొన్న తీరును దర్శకుడు సాకేత్‌ చౌదరి వినోదంతోపాటు భావోద్వేగాలను మిళితం చేసి ఆ చిత్రంలో చూపించారు. 

 

Trending News