Varun Tej-Lavanya: వరుణ్ – లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Mega marriage: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒక్కటవ్వడానికి ఇంకా ఎన్నో రోజులు లేదు. మెగా కాంపౌండ్ సమాచారం ప్రకారం, వచ్చే నెలలోనే వీరి పెళ్లి ఉండబోతుందని టాక్.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 22, 2023, 11:34 AM IST
Varun Tej-Lavanya: వరుణ్ – లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Varun Tej-Lavanya wedding date locked: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. జూన్ 09న ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట త్వరలో వివాహబంధంతో ఒక్కటవ్వనున్నారు. నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ పెళ్లి ఎప్పుడనేది ఈ జంట క్లారిటీ ఇవ్వలేదు. దీంతో వీరి పెళ్లి వార్త నెట్టింట హాట్ టాఫిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా వీరి పెళ్లి గురించి మెగా ఫ్యాన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వరుణ్ – లావణ్య పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే నెల అంటే ఆగస్టు 24న వీరి వివాహానికి ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. వీరి పెళ్లిని ఇటలీలో ఘనంగా జరపబోతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ జంట విదేశాల్లో విహారిస్తున్నట్లు తెలుస్తోంది. పెళ్లికి నెల మాత్రమే సమయం ఉండటంతో షాపింగ్ కోసం ఈ న్యూ కపుల్  పారిస్ వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే నెలరోజుల్లో మెగా ఇంట పెళ్లి భాజాలు మోగడం ఖాయంగా కనిపిస్తోంది. వీరిద్దరూ తొలిసారి కలిసి నటించిన మిస్టర్ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. ఇన్నేళ్లు వీళ్ల రిలేషన్ ను గుట్టు చప్పుడు కాకుండా మెయిన్ టెయిన్ చేశారు. తర్వాత ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో జీవతాన్ని పంచుకోవడానికి సిద్దమయ్యారు. 

వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవధారి అర్జున అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన  సినిమాలో సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. నాజర్, విమలా రామన్, రవి వర్మ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.  సహా నిర్మాతగా నాగబాబు వ్యవహరిస్తున్నాడు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. 

Also Read: SS Rajamouli: ప్రభాస్ 'కల్కి' మూవీ గ్లింప్స్ పై రాజమౌళి ఏమన్నారంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News