Raj Tarun: హీరో రాజ్ ‌త‌రుణ్ కొత్త చిత్రం ప్రారంభం.. జోడీ ఎవరంటే!

Raj Tarun and Varshma Bollama pair up In New Movie | టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ కొత్త చిత్రం హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారంప్రారంభమైంది.డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై నంద్‌కుమార్ అభినేని, భ‌ర‌త్ మ‌గులూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వ‌ర్షా బొల్ల‌మ్మ, రాజ్ తరుణ్‌తో జోడీ కట్టింది.

Last Updated : Nov 3, 2020, 05:19 PM IST
Raj Tarun: హీరో రాజ్ ‌త‌రుణ్ కొత్త చిత్రం ప్రారంభం.. జోడీ ఎవరంటే!

శాంటో ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ (Raj Tarun New Movie) కొత్త చిత్రం హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారంప్రారంభమైంది. డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై నంద్‌కుమార్ అభినేని, భ‌ర‌త్ మ‌గులూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వ‌ర్షా బొల్ల‌మ్మ, రాజ్ తరుణ్‌తో జోడీ కట్టింది. వెన్నెల కిశోర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సంద‌ర్భంగా మూవీ నిర్మాత‌లు నంద్‌కుమార్ అభినేని, భ‌ర‌త్ మ‌గులూరి కొన్ని విశేషాలు పంచుకున్నారు.  Photos:  Raj Tarun New Movie Stills: హీరో రాజ్‌ త‌రుణ్‌కు కొత్త జోడీ కుదిరింది..!

 

‘రాజ్‌త‌రుణ్‌‌తో మా బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. డైరెక్ట‌ర్ శాంటో చెప్పిన క‌థ మాకు బాగా న‌చ్చింది. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా సినిమాను తెరకెక్కిస్తాం. మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్‌ను త్వర‌లోనే ప్రారంభిస్తాం. మరిన్ని విషయాలతో త్వరలో మీ ముందుకు వస్తామని’ నిర్మాతలు నంద్‌కుమార్ అభినేని, భ‌ర‌త్ మ‌గులూరి అన్నారు. 

 

డైరెక్టర్ శాంటో మాట్లాడుతూ ‘రాజ్‌త‌రుణ్ హీరోగా న‌టిస్తున్న 15వ సినిమా ఇది. ఆయ‌న్ని కొత్త కొణంలో చూపించబోతున్నాం. అంద‌ర్నీ ఆక‌ట్టుకునే ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా సినిమా ఉంటుంది. నిర్మాత‌ల‌కు ధన్యవాదాలు. త్వ‌ర‌లోనే షూటింగ్ మొదలుపెట్టి సెట్స్‌పైకి వెళ‌తామని’ చెప్పారు.  

 

స్వీక‌ర్ అగ‌స్తి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్ర‌ఫీ: శ్రీరాజ్ ర‌వీంద్ర‌న్‌, కాస్ట్యూమ్ డిజైన్‌:  అర్చ‌నా రావ్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: ఉద‌య్‌, ర‌వీన‌, ఎడిటింగ్ బాధ్యతలు శ్ర‌వ‌ణ్ క‌టిక‌నేనికి అప్పగించారు.    

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

https://apple.co/3loQYeApple Link - 

 

Trending News