Varsha Bollamma : అందుకే హీరోల తమ్ముళ్లతో చేస్తున్నా.. వర్ష బొల్లమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Varsha Bollamma swathimuthyam promotions కోలీవుడ్ బ్యూటీ వర్ష బొల్లమ్మ ప్రస్తుతం తెలుగు వారికి దగ్గరవుతోంది. స్వాతి ముత్యం అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటూ హిట్ కొట్టేసిన సంగతి తెలిసిందే.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 3, 2022, 06:19 PM IST
  • అక్టోబర్ 5న రాబోతోన్న స్వాతిముత్యం
  • గణేష్ సరసన వర్ష బొల్లమ్మ సందడి
  • హీరోల తమ్ముళ్లపై వర్ష కామెంట్స్
Varsha Bollamma : అందుకే హీరోల తమ్ముళ్లతో చేస్తున్నా.. వర్ష బొల్లమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Varsha Bollamma-Ganesh Bellamkonda :  వర్ష బొల్లమ్మ తెలుగు వారికి సుపరిచితురాలే. విజిల్, 96 వంటి చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించింది. తెలుగులోనే స్ట్రెయిట్ చిత్రాలు చేసింది. చూసీ చూడంగానే, మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటూ అందరినీ ఆకట్టుకుంది ఇక ఇప్పుడు బెల్లంకొండ సురేష్ తనయుడు, బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడైన బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తోన్న స్వాతి ముత్యం సినిమాతో వర్ష మరోసారి తెలుగు వారి ముందుకు రాబోతోంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ  'స్వాతిముత్యం' అనే చిత్రాన్ని నిర్మించారు. ఇందులో వర్ష, గణేష్ జంటగా కనిపించనున్నారు.

ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విభిన్న కథాంశంతో వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర కథానాయిక వర్ష బొల్లమ్మ విలేఖర్లతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో తన డామినేషన్ గురించి చెబుతూ.. సినిమాలో పాత్రల పరంగా చూస్తే నా పాత్ర కొంచెం డామినేటింగ్ గా ఉంటుంది. గణేష్ పాత్ర చాలా అమాయకంగా ఉంటుంది. నేను పోషించిన భాగ్య లక్ష్మి పాత్ర ఒక స్కూల్ టీచర్. ఆ పాత్రకు తగ్గట్లు కొంచెం పెత్తనం చూపిస్తాను అని తెలిపింది.

తన టీచర్ పాత్ర గురించి చెబుతూ.. తన చిన్నతనంలోని గురువులను తలుచుకుంది వర్ష. పాత్ర స్వభావం ఎలా ఉంటుందంటే బయట సరదాగా ఉంటాను కానీ పిల్లల ముందు మాత్రం కాస్త కఠినంగా ఉంటాను. నిజ జీవితంలో నాకు పిల్లలు అరిస్తే ఇష్టం. అలాగే నాకు నిజ జీవితంలో చాలా మంచి గురువులు దొరికారు. వాళ్ళ స్పూర్తితో  సినిమాలో సహజంగా చేశాను అని చెప్పుకొచ్చింది.

విక్కీ డోనార్ చిత్రంతో స్వాతిముత్యంకు పోలిక లేదంటూ.. కథాంశం పోలిక మాత్రమే ఒకటి అని చెప్పుకొచ్చింది. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. కథనం భిన్నంగా సాగుతుంది. ప్రేమ, వినోదంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా కొత్తగా ఉంటుంది అని పేర్కొంది.  తనను ఎక్కువగా ఓ ప్రశ్న అందరూ అడుగుతుంటారట. ఎందుకు హీరోల తమ్ముళ్లతోనే నటిస్తావ్ అని ప్రశ్నిస్తుంటారట.  నేను కావాలని ఎంపిక చేసుకోలేదు. అది అలా కుదురుతుంది అంతే. ఇప్పుడు వస్తున్న యువ హీరోలు మంచి సబ్జెక్టులతో వస్తున్నారు. నన్ను తీసుకోవడానికి అది కూడా కారణమై ఉండొచ్చు అని తెలిపింది.

ప్రస్తుతం తెలుగుతో పాటు తమింలోనూ చేస్తున్నాను. అయితే ఎక్కువగా తెలుగు సినిమాల మీదే దృష్టి పెడుతున్నాను. అలాగే అవకాశమొస్తే కన్నడతో పాటు ఇతర భాషల్లోనూ చేస్తాను అని తన కోరికలను బయటపెట్టేసింది. ఇక తనకు ఎన్టీఆర్ అంటే ఇష్టమని, కొమురం భీముడో పాట గురించి వర్ష ప్రస్థావించింది. 
 

Also Read : Ariyana Latest pics : షర్ట్ బటన్ తీసేసిన అరియానా

Also Read : నామినేషన్లో అర్జున్‌కు చేదు అనుభవం.. సత్య మొండిపట్టు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter Facebook

 

Trending News