Varisu script was written for Mahesh babu says dil raju: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం వారిసు అనే సినిమా విషయంలో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి అందరికీ తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో రష్మిక మందన్న హీరోయిన్ గా వారిసు అనే సినిమా తెరకెక్కింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా అనౌన్స్ చేసిన సమయంలో తెలుగు, తమిళ బై లింగ్యువల్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది.
కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ అనూహ్యంగా విజయ్ తమిళ స్టార్ డం కారణంగా ఈ సినిమాని తమిళ సినిమాగా రూపొందిస్తున్నామని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తామని దిల్ రాజు ప్రకటించారు. ఆ తర్వాత గతంలో దిల్ రాజు చేసిన కొన్ని కామెంట్స్ జ్ఞప్తికి తెచ్చుకుంటూ పలువురు అనేక విషయాలను తెరమీదకు తీసుకొచ్చారు. గతంలో తెలుగు డైరెక్ట్ సినిమాలు ఉండగా డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఇవ్వలేమని అంటూ దిల్ రాజు మాట్లాడిన మాటలనే తెరమీదకు తెస్తూ ఈ విషయాన్ని హైలెట్ చేయడంతో ఇప్పుడు దిల్ రాజు దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా అనేక కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఇప్పుడు అసలు తెలుగులో ఇంత మంది హీరోలు ఉండగా తమిళ హీరోతో ఎందుకు సినిమా చేశారు అంటూ ఒక తాజా ఇంటర్వ్యూలో ఆయనను ప్రశ్నిస్తే ఆయన ఒక అద్భుతమైన సమాధానం తెరమీద తీసుకొచ్చారు. అదేమిటంటే ముందుగా ఈ సినిమా కథ మహేష్ బాబు కోసం రాసుకున్నదని కానీ మహేష్ బాబు బిజీగా ఉండటంవల్ల ఆ కథ వేరే వాళ్లకు దగ్గరికి వెళ్లిందని అన్నారు. ప్రభాస్ అల్లు అర్జున్ వద్దకు కూడా ఈ సినిమా వెళ్ళింది కానీ వారంతా కూడా బిజీగా ఉండడంతో తమిళ స్టార్ హీరో విజయ్ వద్దకు వెళ్లిందని ఆయన కామెంట్ చేశారు.
ప్రభాస్, అల్లు అర్జున్ కంటే ముందే ఈ సినిమా రామ్ చరణ్ వద్దకు కూడా వెళ్లింది కానీ ఆయన స్వయంగా నా బ్యానర్ లోనే సినిమా చేస్తూ ఉండడంతో ఆయన కూడా సినిమా చేయలేకపోయారని వారిలో ఎవరు ఒప్పుకున్నా ఇది తెలుగు సినిమా గానే ఉండేదని వీరందరూ బిజీగా ఉండడంతోనే తమిళ స్టార్ హీరో విజయ్ వద్దకు ఈ సినిమా కథ వెళ్లిందని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఇంత మంది చేయలేమని చెప్పిన కథను విజయ్ చేశారా? ఆయన అంత కాళీగా ఉన్నారా? అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Also Read : Upasana Surrogacy : సరోగసి ద్వారా బిడ్డను కంటోన్న ఉపాసన.. అసలు మ్యాటర్ ఇదా?
Also Read : ED Notice to Rakul Preet : డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్‌కు ఈడీ నోటీసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook