Ajith - Valimai: కళ్లు చెదిరే విన్యాసాలు.. బైక్‌పై నుంచి జారిపడిపోయిన స్టార్ హీరో!!

తమిళ స్టార్ హీరో అజిత్‌ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా 'వాలిమై'. ఈ సినిమా కోసం అజిత్‌ చేసిన స్టంట్స్‌ అందరిని ఆకట్టుకుంటున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2021, 02:17 PM IST
  • బైక్‌పై నుంచి జారిపడిపోయిన స్టార్ హీరో
  • బైక్‌ స్టంట్స్‌ చేస్తుండగా జారిపడ్డ అజిత్‌
  • కళ్లు చెదిరే విన్యాసాలు
 Ajith - Valimai: కళ్లు చెదిరే విన్యాసాలు.. బైక్‌పై నుంచి జారిపడిపోయిన స్టార్ హీరో!!

Ajith Kumar falls off a sports bike while Valimai shooting: తమిళ స్టార్ హీరో అజిత్‌ కుమార్ (Ajith Kumar) ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా 'వాలిమై' (Valimai ). హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని జీ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. అజిత్ సరసన బాలీవుడ్ భామ హ్యుమా ఖురేషి (Huma Qureshi) కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ యువ హీరో కార్తికేయ (Karthikeya) ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. వాలిమై చిత్రం 2022 సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.

వాలిమై (Valimai) సినిమా కోసం చిత్ర బృందం ఎంత కష్టపడిందో తెలియజేసేలా తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. కరోనాకి ముందు, తర్వాత పరిస్థితిని చూపిస్తూ తీర్చిదిద్దిన ఈ మేకింగ్‌ వీడియో అద్భుతంగా ఉంది. భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అజిత్‌ (Ajith Kumar), కార్తికేయ ఎంత కష్టపడ్డారో వీడియోలో చూడొచ్చు. ప్రాణాలకు తెగించి మరి రేసింగ్ సీన్ చేశారు. ఒకానొక సందర్భంలో బైక్‌ స్టంట్స్‌ చేస్తుండగా అజిత్‌ జారిపడ్డారు. అయినా కూడా మరో ప్రయత్నంలో సరిగా చేసి ఆకట్టుకున్నారు. 

Also Read: Breaking News: వాగులో పడిన ఆర్టీసీ బస్సు- ఐదుగురు ప్రయాణికులు మృతి

వాలిమై (Valimai) సినిమా కోసం చేసిన ఆన్ రోడ్ చేసింగ్ సీన్‌లు చాలా బాగున్నాయి. కదులుతున్న బస్సులో, స్పోర్ట్స్ బైక్ ద్వారా చేసిన స్టంట్స్‌ అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా హీరో అజిత్‌ కుమార్ (Ajith Kumar) చేసిన స్టంట్స్‌ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా కోసం అజిత్ చాలా రోజుల సమయం కేటాయించారు. వాలిమై సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంతలా అంటే.. క్రికెట్ మ్యాచులు జరుగుతున్నపుడు ఆటగాళ్లను కూడా వాలిమై అప్ డేట్ ఏంటి అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను కూడా వాలిమై అప్ డేట్ ఏంటి అని తమిళ ఫాన్స్ అడిగారు. 

Also Read: అమాయకమైన చూపుతో చిరునవ్వు చిందిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News