Nithin Movie: పుష్ప బాటలో నితిన్-వక్కంతం వంశీ సినిమా.. ఇదేం సాహసమబ్బా?

Vakkantham Vamsi Nithin Movie Similar to Pushpa Line: నితిన్-వక్కంతం వంశీ సినిమా షూటింగ్ ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభమైంది, అయితే ఈ సినిమా లైన్ వింటుంటే పుష్ప లైన్ విన్నట్టే ఉందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే 

Last Updated : Nov 28, 2022, 12:58 PM IST
Nithin Movie: పుష్ప బాటలో నితిన్-వక్కంతం వంశీ సినిమా.. ఇదేం సాహసమబ్బా?

Vakkantham Vamsi Nithin Movie Similar to Pushpa Line: నితిన్ చివరిసారిగా మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఎడిటర్ గా ఉండి దర్శకుడిగా మారిన దర్శకుడు రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంటాడని నితిన్ భావించాడు కానీ ఎందుకో ఆ ప్రయత్నం అయితే సఫలం కాలేదు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత నితిన్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఒక సినిమా ఎన్నో చేశారు. వక్కంతం వంశీ చివరగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా చేశారు.

అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇది భారీ డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఇక ఇలా రెండు డిజాస్టర్లతో బాధ పడుతున్న ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుందని అనగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అసలు ఎలాంటి సబ్జెక్ట్ ఎంచుకుంటారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో వీరిద్దరి కాంబినేషన్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. నితిన్ కెరియర్ లో 32వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి మారేడుమిల్లి అడవిలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం తెర మీదకు వచ్చింది అదేమిటంటే ఈ సినిమాలో నితిన్ ఒక స్మగ్లర్ పాత్రలో కనిపించబోతున్నాడని, అంతేకాక ఆ స్మగ్లర్ పాత్రలో కనిపిస్తూ కూడా పూర్తిగా గడ్డంతో రఫ్ లుక్ లో కనిపిస్తాడని అంటున్నారు. దానికి తోడు ఈ సినిమాలో నితిన్ లారీ డ్రైవర్ గా కూడా కనిపిస్తాడని అంటున్నారు. దానికి తగ్గట్టుగానే షూటింగ్ కూడా మారేడుమిల్లి అడవుల్లోనే జరుగుతూ ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

దానికి ముఖ్య కారణం నితిన్ ఏవైతే ఫాలో అవుతున్నాడో అవన్నీ కూడా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఫాలో అయినవే. పుష్ప సినిమాలో కూడా అల్లు అర్జున్ ఒక స్మగ్లర్ గా, లారీ నడుపుతాడు పూర్తిగా గడ్డంతో రఫ్ లుక్ లో కనిపిస్తాడు. పుష్ప సినిమా షూటింగ్ కూడా దాదాపుగా మారేడుమిల్లిలోనే జరిగింది. అయితే ఇవన్నీ గుర్తు రాగానే అసలు ఇప్పుడు నితిన్ ఎందుకు ఇలాంటి సబ్జెక్ట్ చేస్తున్నాడా అనే చర్చ జరుగుతోంది.

కచ్చితంగా ఇన్ని సారూప్యతలు ఉన్నాయి కాబట్టి పుష్ప సినిమాతో కంపేర్ చేస్తారు. దీనివల్ల సినిమాకి ఇబ్బందికరమైన పరిస్థితి తప్ప మరోటి లేదు. అయితే మరి ఇంత రిస్క్ చేసి నితిన్ ఎందుకు ముందుకు వెళుతున్నాడు? అనే విషయం గురించి టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో నితిన్ సరసన హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించబోతోంది. చూడాలి మరి ఈ సబ్జెక్ట్ ఏమిటి? ఎందుకు పుష్ప లైన్లోనే ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు అనేది.
Also Read: Anasuya Bharadwaj: అన్నంత పనీ చేసిన అనసూయ భరద్వాజ్.. పిచ్చి రాతలు రాసిన యువకుడు అరెస్ట్!

Also Read: Vakkantham Vamsi Nithin Movie : ఎట్టకేలకు వక్కంతం వంశీకి చాన్స్.. అన్నీ నెగెటివ్ సెంటిమెంట్లే.. వర్కౌట్ అయ్యేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News