Urfi Javed F word: కేసులెందుకు అని అడిగితే బూతులతో విరుచుకుపడిన వింత జీవి!

Urfi Javed reacts to FIR on her: వింత వింత డ్రెస్సులు వేసుకుని కాక రేపుతూ ఉండే ఉర్ఫీ జావేద్ మీద పలు ఎఫ్ఐఆర్లు నమోదవగా వాటిపై స్పందిస్తూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 10, 2022, 03:51 PM IST
Urfi Javed F word: కేసులెందుకు అని అడిగితే బూతులతో విరుచుకుపడిన వింత జీవి!

Urfi Javed reacts to FIR filed against her: సోషల్ మీడియా సంచలనం ఉర్ఫీ జావేద్ తన అసాధారణ ఫ్యాషన్ సెన్స్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. తన వింత డ్రెస్సింగ్ సెన్స్ తో అందరినీ తన వైపు తిప్పుకున్న ఆమె ప్రస్తుతం న్యాయపరమైన చిక్కుల్లో ఉంది. మీడియా కథనాల ప్రకారం, ఉర్ఫీ, జావేద్‌పై ఢిల్లీలో ఒక కేసు నమోదైంది. అక్టోబర్‌లో ఆమె చేసిన మ్యూజిక్ వీడియో 'హాయ్ హాయ్ యే మాబుల్ది' విడుదలైన తర్వాత ఆమె మీద ఒకరు కేసు పెట్టారు.

అంతకుముందు, హాస్యనటుడు సునీల్ పాల్ కూడా ఆమె దుస్తులను సహా బహిరంగంగా బాడీ పార్ట్స్ ప్రదర్శన చేస్తోంది అంటూ ఉర్ఫీని నిందించాడు. అదే సమయంలో, ఇప్పుడు, ఉర్ఫీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ సహా సునీల్ పాల్ అలాగే ఇతర ట్రోల్‌ కామెంట్స్ పై మౌనం వీడారు. ఇప్పుడు ఉర్ఫీ జావేద్ స్పందిస్తూ మరోమారు బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇటీవల, ఉర్ఫీ జావేద్ వైట్ మోనోకోనీలో బహిరంగంగా కనిపించింది. ఆ మోనికినితో పాటుగా ఒక పూసల స్కర్ట్ కూడా ధరించింది.  

వైట్ హీల్స్ మరియు పోనీ టైల్‌తో ఆమె సందడి చేసింది. ఈ క్రమంలోనే ఒక రెస్టారెంట్ వెలుపల మీడియాతో ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు, ఉర్ఫీ జావేద్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై స్పందిస్తూ, "ఇది నాకు చాలా కామెడీగా అనిపిస్తోందని పేర్కొంది. నాకు పబ్లిసిటీ పిచ్చి అంటారు కానీ నా పేరును వాడుకుని అసలు పబ్లిసిటీ తెచ్చుకునేది వీరే అంతో ఆమె కామెంట్ చేసింది. నేను ఇలా డ్రెస్ లు ధరించినందుకు నా పేరు వాడుకుంటూ పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారని పేర్కొంది.

మరి కొద్ది రోజుల్లో నాపై నమోదు అవుతున్ననన్నీ ఎఫ్‌ఐఆర్‌లు ఏ రేపిస్ట్‌పైనా కూడా రావేమో అంటూ ఆమె కామెంట్ చేసింది. నేను నా శరీరానికి ఏమి చుట్టుకుంటున్నాను లేదా నేను ఏమి ధరించాను అనేది నా ఇష్టం అని ఆమె పేర్కొన్నారు. జనం ఇది ఎప్పటి నుంచి పట్టించుకుంటున్నారని ప్రశ్నించిన ఆమె భారతదేశం తాలిబాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్ కాదని అన్నారు. ఒక అమ్మాయి ఏమి ధరించాలి లేదా ధరించకూడదు అనేదానిని మీరు నియంత్రించలేరని పేర్కొన్న ఆమె ఒక ఎఫ్ వర్డ్ కూడా వాడడం గమనార్హం. 
Also Read: Chiru Vs Balayya: అడకత్తెరలో పోక చెక్కలా మైత్రీ సంస్థ.. ఇద్దరు హీరోల మధ్య సతమతం!

Also Read: Samantha Tension: మరో క్యాంపులో మంటలు పెట్టేసిన సమంత.. ఆ ప్రకటన వెనుక పరమార్ధం అదేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x