ఉచితంగా మందులు ఇస్తామంటున్న ఉపాసన

'కరోనా వైరస్'.. కారణంగా పేదవారి బతుకులు చిన్నాభిన్నంగా మారాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఒకవైపు.. మరోవైపు కరోనా వైరస్ వెంటాడుతుందనే భయం. ఈ దెబ్బతో రెండు వైపులా పేద ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

Last Updated : Apr 5, 2020, 04:24 PM IST
ఉచితంగా మందులు ఇస్తామంటున్న ఉపాసన

'కరోనా వైరస్'.. కారణంగా పేదవారి బతుకులు చిన్నాభిన్నంగా మారాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఒకవైపు.. మరోవైపు కరోనా వైరస్ వెంటాడుతుందనే భయం. ఈ దెబ్బతో రెండు వైపులా పేద ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

మరోవైపు కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునేందుకు మనసున్న మారాజులు ముందుకొస్తున్నారు. కరోనా పాజిటివ్ వారికి సేవ చేసేందుకు ప్రధాన మంత్రి సహాయ నిధికి, ముఖ్యమంత్రుల సహాయ నిధులకు తోచినంత సాయం చేస్తున్నారు. అంతే కాదు తమకు తోచిన విధంగా సాయం చేసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు సిద్ధమయ్యారు. 

ఇందులో భాగంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ  పేరుతో పేద వారికి సాయం చేస్తున్నారు. వారి ఆరోగ్యం కోసం ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ఐతే ఈ చారిటీకి కూడా సినీ ప్రముఖుల నుంచి సాయం అందుతోంది. డబ్బు రూపంలో ఇతరత్రా మార్గాల్లో సినీ ప్రముఖులు సాయం అందిస్తున్నారు.

ఐతే ఇప్పుడు ఈ  చారిటీకి తనదైన శైలిలో సాయం చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన కూడా  ముందుకొచ్చారు.  కరోనా క్రైసిస్ చారిటీ నుంచి వైద్య పరీక్షలు  చేయించుకున్న పేద వారికి ఉచితంగా మందులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అన్ని అపోలో ఫార్మసీల నుంచి ఈ మందులు తీసుకోవచ్చని తెలిపారు. 

మరోవైపు కోడలు సాయాన్ని మెగాస్టార్ అభినందించారు. పేద ప్రజలకు ఉచితంగా మందులు అందించేందుకు ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 

Trending News