Unni Mukundan About Samantha Myositis : సమంత నటించిన యశోద చిత్రం విడుదలకు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ వచ్చే వారం అంటే నవంబర్ 11న విడుదల కాబోతోంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో సమంత పక్కన ఉన్ని ముకుందన్ నటించాడు. జనతా గ్యారేజ్ సినిమాలో మంచి పాత్రను పోషించి తెలుగు వారికి దగ్గరయ్యాడు. అయితే ఇప్పుడు సమంత యశోద సినిమాతో మరోసారి తెలుగు వారిని మెప్పించేందుకు వస్తున్నాడు.
ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఉన్ని ముకుందన్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తను ఇప్పటి వరకు మూడు తెలుగు సినిమాలు చేశానని, అందులో అన్ని మంచి పాత్రలేనని అన్నాడు. ఇప్పుడు యశోద చిత్రంలో నటించానని, సమంత చాలా టాలెంటెడ్ యాక్ట్రెస్ అని కొనియాడాడు. కథ ఏంటి? అందులో పాత్ర ఏంటి? అన్న విషయాలే తాను పట్టించుకున్నానని తెలిపాడు.
దర్శకులు హరి, హరీష్ కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పేశానని తెలిపాడు. ప్రస్తుతానికి తన క్యారెక్టర్ గురించి ఎక్కువ చెప్పలేనని, ఎందుకనేది సినిమా చూస్తేనే అర్థమవుతుందని అన్నాడు ఉన్ని ముకుందన్. తాను కథను ఎంచుకున్నది కూడా అందుకేనని తెలిపాడు. తన రోల్ గురించి ప్రస్తుతానికి సస్పెన్స్‌లో ఉండనివ్వండని నవ్వేశాడు.
సమంత అంకితభావం ఉన్న నటి మాత్రమే కాకుండా ఎంతో కష్టపడే తత్వం ఉంటుందని అన్నాడు. తన పాత్ర కోసం సమంత ఎంతగానో ప్రిపేర్ అయ్యేదట. ఫైట్స్ బాగా చేయడమే కాకుండా యాక్షన్, ఎమోషనల్ సీన్స్ బాగా చేశారని మెచ్చుకున్నాడు. సెట్‌లో ఇతర ఆర్టిస్టులతో చక్కగా మాట్లాడతారని, ఒక సన్నివేశం చేసేటప్పుడు ఎలా చేస్తే బావుంటుందని ఐడియాస్ డిస్కస్ చేసుకున్నామని సమంతతో పని చేసిన అనుభవం గురించి చెప్పుకొచ్చాడు.
సమంతకు మయోసైటిస్ ఉందనే విషయం షూటింగ్ చేసే సమయంలో తెలియదని అన్నాడు. సెట్‌లో సమంత చాలా ప్రొఫెషనల్‌గా ఉండేవారని అన్నాడు. ఎప్పుడూ కూడా తాను అటువంటి వ్యాధితో పోరాటం చేస్తున్నాని చెప్పలేదని అన్నాడు ఉన్ని ముకుందన్. సమంత పోస్ట్ చూసి ఎంతో బాధగా అనిపించిందని అన్నాడు. సమంతను దగ్గర నుంచి చూసి వ్యక్తిగా చెబుతున్నా.. ఆవిడ మైయోసిటిస్‌తో పోరాటం చేసి త్వరలోనే మన ముందుకు వస్తారని ధీమా వ్యక్తం చేశాడు.
Also Read : Aditi rao Hydari- Siddharth: సిద్దార్థ్-అదితీ రావు హైదరీ రిలేషన్ పై ఓపెన్ అయిన శర్వా.. ఏమో పలికిందేమో అంటూ!
Also Read : Sharwanand to Balakrishna: శర్వానంద్ డబుల్ మీనింగ్ ప్రశ్న.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలకృష్ణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook