Megastar Chiranjeevi Unknown Facts: చిరంజీవికి 10 బిరుదులు.. ఆ షూటింగ్లో విష ప్రయోగం!

Unknown Facts About Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మీకు తెలియని కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 22, 2022, 08:54 AM IST
Megastar Chiranjeevi Unknown Facts: చిరంజీవికి 10 బిరుదులు.. ఆ షూటింగ్లో విష ప్రయోగం!

Unknown Facts About Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ అంటేనే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతంలో జన్మించిన ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలే గాడ్ ఫాదర్ గా మారారు. అయితే మెగాస్టార్ చిరంజీవి గురించి దాదాపు అన్ని విషయాలు అందరికీ తెలుసు కానీ ఆయన గురించి ఆయన రికార్డుల గురించి మాత్రం ఈ తరం వారికి పెద్దగా అవగాహన లేదు. ఈ నేపథ్యంలో ఆయన జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామును. 
 
ఇప్పుడంటే మనం ప్రభాస్ ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరో అని కొనియాడుతున్నాం కానీ ఒకానొక కాలంలోనే మెగాస్టార్ ఇండియాలోని అత్యధిక భారీ రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా రికార్డు సృష్టించారు ఆ రోజుల్లో ఒక్కో సినిమాకు కోటి పాతిక లక్షలు అందుకుని మరీ హీరోకి సాధ్యం కాని రికార్డు ఆయన సృష్టించారు. అప్పట్లో ఇండియన్ టాప్ హీరోగా ఉండే అమితాబ్ కు కేవలం కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చేవారు. 

సౌత్ నుంచి ఆస్కార్ అవార్డులకు ఆహ్వానించబడిన మొట్టమొదటి హీరోగా కూడా మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. ఇక ఇంద్ర సినిమాతో 30 కోట్ల షేర్ వసూలు రాబట్టి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సంపాదించడమే కాక అత్యధిక కలెక్షన్లు సాధించిన హీరోగా కూడా నిలిచారు. అంతేకాక ఐదు ఇండస్ట్రీ హిట్లు సాధించిన ఏకైక టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి,  ఇప్పటికీ ఈ రికార్డు ఏ హీరో కూడా బ్రేక్ చేయలేకపోయారు అంటే ఆయన క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక టాలీవుడ్ లో 10 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న మొట్టమొదటి హీరో చిరంజీవి కాగా 4 నంది అవార్డులు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. 

అనేక బిరుదులు:

అందరికీ మెగాస్టార్ చిరంజీవి బిరుదు మెగాస్టార్ అనే తెలుసు కానీ మెగాస్టార్ అనే బిరుదు పెట్టక ముందు ఆయనను సుప్రీం హీరో అని సంబోధించేవారు. నిజానికి 85 సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి అనే టైటిల్ వాడకుండా కేవలం చిరంజీవి అనే టైటిలే వాడారు. తర్వాత డేరింగ్ డాషింగ్ డైనమిక్ అనే టైటిల్స్ 11 సినిమాలకు వాడారు. సుప్రీం హీరో అని 14 సినిమాలకు వాడారు. ఇక మెగాస్టార్ అని 34 సినిమాలుకు, నట కిషోర్ అని రెండు సినిమాలకు, సుప్రీం అనే రెండు సినిమాలకు, రోరింగ్ లయన్ అని ఒక సినిమాకి సుప్రీం స్టార్ అనే ఒక సినిమాకి, మా ఘరానా చిరంజీవి అని ఒక సినిమాకి, నట విజేత అని ఒక సినిమాకి ఆయనను సంభోదించారు.

నట కిషోర్:

ఇక క్రియేటివ్ కమర్షియల్ అనే నిర్మాణ సంస్థ అధినేత కేఎస్ రామారావు నిర్మాణంలో చిరంజీవి అనేక సినిమాలు నటించి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఆయనే మెగాస్టార్ చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చారు. 92లో విడుదలైన ఘరానా మొగుడు టాలీవుడ్ లో 10 కోట్లు కలెక్షన్లు సాధించిన మొట్టమొదటి టాలీవుడ్ సినిమాల నిలిచింది. మెగాస్టార్ అసలు పేరు శివశంకర వరప్రసాద్ కాగా తమ కుటుంబం అంతా ఎక్కువగా పూజించే ఆంజనేయ స్వామికి మరో పేరైన చిరంజీవి అనే పేరును తన తల్లి సూచనలు తన స్క్రీన్ నేముగా పెట్టుకున్నారు మెగాస్టార్. ఏ క్షణాన అలా పెట్టుకున్నారో తెలియదు కానీ చిరంజీవిగా టాలీవుడ్ లో కూడా నిలిచిపోయారు. నిజానికి మెగాస్టార్ చిరంజీవి ద రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అనే ఒక హాలీవుడ్ సినిమాలో నటించాల్సి ఉంది కానీ కొన్ని అనుకోని కారణాలతో సినిమా నిలిచిపోయింది. ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంజయ్య మెగాస్టార్ చిరంజీవికి నట కిషోర్ అనే బిరుదు ఇచ్చారు.

విష ప్రయోగం:

కెరీర్లో మంచి పీక్ పొజిషన్ లో ఉన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి మీద విష ప్రయోగం కూడా జరిగింది. అయితే ఈ విషయం అప్పట్లో బయటకు కూడా రాలేదు. ఒక అవుట్డోర్ షూటింగ్ లొకేషన్లో షూటింగ్ జరుపుతున్న క్రమంలో ఆయనను కలవడానికి రోజు అనేకమంది అభిమానులు వచ్చేవారు. అలా ఒకరోజు ఒక అభిమాని వచ్చి తన పుట్టినరోజు అని మీ సమక్షంలో కేక్ కట్ చేయాలని పట్టుపట్టడంతో అక్కడే ఉండి కేక్ కటింగ్ కూడా చేయించారు. తర్వాత కేక్ తినాలని సదరు అభిమాని చిరంజీవిని బాగా బలవంతం చేశారు. కానీ చిరంజీవి అందుకు ఒప్పుకోలేదు. కట్ చేసిన తర్వాత ఆ కేక్ ని చిరంజీవి నోట్లో బలవంతంగా కుక్కిన అభిమాని అక్కడి నుంచి మాయం అయ్యాడు. చిరంజీవికి అనుమానం వచ్చి వెంటనే దాన్ని బయటికి ఉమ్మేశారు. ఈ హడావుడిలో కేక్ కింద పడింది, ఆ సమయంలో రంగురంగుల పదార్థాలు కేకు నుంచి బయటకు వచ్చాయి. తర్వాత చిరంజీవి వెళ్లి నోరు కడుక్కుని తన సినిమా షూటింగ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తన పెదాలు నీలిరంగులోకి మారిపోయిన విషయాన్ని గమనించి నిర్మాతలు దృష్టికి తీసుకువెళ్లారు. వారు డాక్టర్స్ ను సంప్రదించడంతో విష పదార్థాల వల్లనే పెదాలు రంగు మారుతాయి అనే విషయం తెలియడంతో అప్పటికప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్లి వాంతులు అయ్యేలా టాబ్లెట్స్ ఇచ్చి రాత్రంతా అబ్జర్వేషన్ లో ఉంచారు. అలా ఒక పెను ప్రమాదం నుంచి మెగాస్టార్ చిరంజీవి బయటపడ్డార. ఈ విషయం అప్పట్లో చాలా మందికి తెలియదు. ఇటీవల ఈ విషయాన్ని మురళీమోహన్ పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు.

Also Read: Chiranjeevi: సొంతూరి అభిమానికి మెగా సాయం.. దటీజ్ మెగాస్టార్ అంటూ ప్రసంశలు!

Also Read: Megastar Chiranjeevi Birthday Special: మొగల్తూరు టు ఫిలింనగర్.. స్వయంకృషే పెట్టుబడి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News