Bigg Boss Telugu 6: బిగ్‌బాస్‌ 6లో రెండు జంటలు… మళ్లీ రెచ్చిపోయి దారుణ కామెంట్స్ చేసిన నారాయణ

Two Pairs in Bigg Boss Telugu 6: ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఒక్క జంట కాదు, రెండు జంటలు ఎలాగో తెలుసా?

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 5, 2022, 09:03 PM IST
Bigg Boss Telugu 6: బిగ్‌బాస్‌ 6లో రెండు జంటలు… మళ్లీ రెచ్చిపోయి దారుణ కామెంట్స్ చేసిన నారాయణ

Two Pairs in Bigg Boss Telugu 6: తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ అట్టహాసంగా ప్రారంభమైంది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చారు. అయితే వీళ్ళలో ఒక నిజజీవిత జంట ఉండటం ఆసక్తికరంగా మారింది. నిజానికి బిగ్ బాస్ సీజన్ 3 లో వరుణ్ సందేశ్, వితికా షేరు ఇద్దరూ కూడా రియల్ జంటగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పటివరకు మరో జంట అలా ఎంట్రీ ఇవ్వలేదు.

మళ్లీ సీజన్ సిక్స్ లో అలా ఒక జంట ఎంట్రీ ఇచ్చింది. ఈ అంశం ప్రస్తుతానికి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వాళ్లు మరెవరో కాదు రోహిత్, మరీనా. ఈ ఇ ద్దరూ బుల్లితెర వీక్షకులకు ప్రేక్షకులందరికీ సుపరిచితమే వీరిద్దరూ కూడా వేరువేరుగా పలు సీరియల్స్ చేశారు. మరీనా  ‘అమెరికా అమ్మాయి, ప్రేమ’ సీరియల్స్ లో నటించగా, రోహిత్ ‘నీలికలువలు, అభిలాష’ సీరియల్స్ లో నటించాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తాము ఇద్దరం కలిసి ఒక సినిమాలో హీరో హీరోయిన్గా నటించామని అయితే ఆ సినిమా విడుదల కాలేదని బిగ్ బాస్ స్టేజ్ మీద ప్రకటించారు ఈ జంట.  

అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ బిగ్ బాస్ సీజన్ లో మరో జంట కూడా లోపలికి వెళ్లిందని అంటున్నారు. అయితే వాళ్ళు నిజ జీవిత జంట కాదు రియల్ జంట అని తెలుస్తోంది. వారు మరెవరో కాదు హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ కళ్యాణ్, వాసంతి కృష్ణన్. ఈ ఇద్దరు కలిసి ఒక సినిమాలో హీరో హీరోయిన్గా నటించారు. అడ్డతీగల అనే పేరుతో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో ఉంది. వీరిద్దరూ హౌస్ లోపలికి ఎంట్రీ ఇస్తున్న విషయం కూడా ఒకరికి ఒకరికి తెలియదట. అలా సీక్రెట్ మైంటైన్ చేస్తూ చివరికి ఇద్దరు కలిసి హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చినట్లు అయింది. 

CPI Narayana Slams Bigg Boss 6: ఇక బిగ్ బాస్ అంటే అంత ఎత్తున ఎగిరి పడే సీపీఐ  జాతీయ కార్యదర్శి నారాయణ బిగ్‌బాస్‌ షోపై మరోసారి తన ఆగ్రహాన్ని బయటపెట్టారు. ప్రతిసారి మీడియాతో ముచ్చటించే ఆయన ఈసారి ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. సిగ్గు, ఎగ్గు లేని జంతువులు ఏమైనా  చేయగలవన్న నారాయణ వింత జంతువులు, భార్యాభర్తలు కానోళ్ళు, అన్న చెల్లెలు  కానోళ్ళు ముక్కు ముఖం తెలియని పిటపిటలాడే అందగాళ్ళు.. అచ్చోసిన ఆంబోతుల్లా అక్కినేని నాగార్జున కనుసన్నల్లో 100 రోజుల పాటు బూతుల స్వర్గంలో అమూల్య కాలాన్ని వృథా చేసే మహత్తర BIG BOSS అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. శక్తి యుక్తులు ఉన్న యువత సమాజం కోసం పని చేయాలన్న ఆయన వంద రోజుల అమూల్య కాలాన్ని వృథా చేస్తారా? అంటూ ప్రశ్నించారు.

అంతే కాదు ఈసారి వీక్షకుల మీద్ద కూడా ఆయన విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమాన్ని సిగ్గులేని ప్రేక్షకులు టీవీల ముందు విరగబడి చూస్తూ జాతీయ సంప‌ద‌ను వృథా చేస్తున్నారని, ‘ప్రేక్షకులే దీనిపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కాసులకు కక్కుర్తి పడే ల‌జ్జారహితులున్నంత కాలం, ఈ పాపాలకు ఆదరణ ఉంటున్నంత కాలం, ద్రౌపది వస్త్రాపహరణం వర్ధిల్లుతూనే ఉంటుందని బాధాక‌రంగా దిగమింగుదామా? శ్రీ శ్రీ చెప్పినట్టు పదండి ముందుకు, పదండి ముందుకని అంటూ ఉరుకుదామా?’’ అంటూ నారాయణ పేర్కొన్నారు. 

Also Read: Aravind Swamy in NBK 108: బాలకృష్ణ సినిమాలో అరవింద్ స్వామి.. షాకింగ్ పాత్రలో?

Also Read: Sonakshi Sinha Hot Pics: వైట్ డ్రెస్‌లో సోనాక్షి సిన్హా.. 'నెవర్ బిఫోర్' అనే అందాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News