Tuck Jagadish: అమెజాన్ ప్రైమ్‌లో నాని 'టక్ జగదీష్'...! స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!

Tuck Jagadish: నేచురల్ స్టార్ నాని తాజా సినిమా టక్ జగదీష్. ఈ మూవీ కుటుంబ కథా చిత్రంగా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈచిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబరు 10న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఫిలింవర్గాల్లో టాక్ నడుస్తోంది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 27, 2021, 11:46 AM IST
Tuck Jagadish: అమెజాన్ ప్రైమ్‌లో నాని 'టక్ జగదీష్'...! స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!

Tuck Jagadish:  స్టార్ నాని హీరోగా.. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’  (Nani Tuck Jagadish)అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే మొదటి నుంచీ ఈ చిత్రంపై అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి.ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

'టక్ జగదీష్' మూవీని థియేటర్లలోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించినా.. కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి నాని ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10 అర్ధరాత్రి 12 గంటలకి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా.. రీతూ వర్మ(Ritu Verma), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) హీరోయిన్స్‌గా నటించారు. ఇక ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్(Amazon Prime) అదిరిపోయే ఆఫర్‌ను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటీటీ విడదల కోసం ఏకంగా రూ. 45 కోట్లను అమెజాన్ ప్రైమ్ చెల్లించినట్లు సమాచారం. సన్ షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తున్నారు. 

Also Read: RRR movie shooting: ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ముగించుకుని వెళ్తున్న Jr Ntr, Ram Charan

నాని(Hero Nani) నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. నాని ట్యాక్సీవాలా' ఫేమ్‌ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 27వ సినిమాగా శ్యామ్ సింగరాయ్’(Shyam Singha Roy)సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి వెంకట్‌ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. సాయి పల్లవి(Sai pallavi), 'ఉప్పెన' ఫేమ్‌ కృతిశెట్టి(kriti shetty) హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని 70 ఏళ్ల వయసు మళ్లిన వ్యక్తిగా ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నాడట. పిరియాడిక్‌ మూవీగా రూపొందనున్న ఈ చిత్రం మొత్తం కోల్‌కతా(Kolkata) నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ మూవీకి మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలతో పాటు నాని 'బ్రోచే వారెవరురా' ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే ఓ అడల్ట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News