Truth Behind Dil Raju Postponing Varasudu Movie: తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారిసు అనే సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాను ముందుగా తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తామని ప్రకటించారు. కానీ తర్వాత ఇది తమిళ సినిమా అని తెలుగులో డబ్బింగ్ చేయించి రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి, వాటిని గతంలో చాలాసార్లు ప్రస్తావించుకున్నాం. అయితే సినిమాను ముందుగా జనవరి 12వ తేదీన తమిళ్, తెలుగు భాషలతో పాటు హిందీ భాషలో కూడా విడుదల చేస్తామని దిల్ రాజు ప్రకటించారు. అయితే తర్వాత తమిళంలో ఈ సినిమాకి పోటీగా విడుదలవుతున్న అజిత్ తునివు సినిమా 11వ తేదీన విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమాని మరొక రోజు ముందుకు జరిపి 11వ తేదీనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు తాజాగా సినిమా తమిళ వర్షన్ 11వ తేదీని విడుదల చేస్తున్నామని కానీ తెలుగు వర్షన్ మాత్రం 14వ తేదీ విడుదల చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు దిల్ రాజు. ముందు నుంచి ఇది వ్యాపారం వ్యాపారాన్ని ఎవరికోసం వదులుకోను అంటూ చెబుతూ వచ్చిన దిల్ రాజు ఇప్పుడు కేవలం నందమూరి బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు ఉన్నాయి కాబట్టే ముందు వాళ్ళ సినిమాలు తెలుగు ప్రేక్షకులు చూడాలని తాను భావిస్తూ సినిమాని వాయిదా వేసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఇంకా తెలుగు వర్షన్ పనులు పూర్తవ్వలేదు కదా అందుకే వాయిదా వేస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది అని జర్నలిస్టులు అడిగితే అదేమీ లేదని ఇప్పటికే ఫైనల్ కాపీ రెడీగా ఉందని కూడా చెప్పుకొచ్చారు.
అయితే తెలుగు సెన్సార్ ఇంకా పూర్తి కాలేదు ఈరోజు సెన్సార్ కి ఇస్తే రేపటి సర్టిఫికెట్ ఇస్తారు కానీ అసలు కారణం అది కాదని దిల్ రాజు చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అజ్ఞాతవాసి, బ్రహ్మోత్సవం లాంటి రెండు మూడు సినిమాలు కలిపి సినిమా చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది కదా అంటే మీకు ట్రైలర్ చూసి అలా అనిపించింది అంటే పూర్తి కథ విన్న నాకు ఏ ఏ సినిమాల కథలకు దగ్గరగా ఉందో తెలియదా? అయినా నేను సినిమా చేశానంటే అర్ధం ఏమిటి? సినిమా అంటే రెండున్నర గంటలు ఎలా ఉందో చూసి చెప్పాలి కానీ ఒక సీను రెండు సీన్లు చూసి చెప్పకూడదని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. అయితే అసలు ఇప్పుడు ఈ సినిమా వాయిదా వేయడానికి గల కారణం మరోటి ఉందనే వాదన వినిపిస్తోంది. అదేమిటంటే నిజంగానే ఈ సినిమా చూసినప్పుడు అజ్ఞాతవాసి బ్రహ్మోత్సవం అలవైకుంఠపురంలో లాంటి సినిమాలు జ్ఞప్తికి వస్తాయని, తెలుగు వాళ్ళందరూ ఈ సినిమాలు ఇప్పటికే చూసేసారు కాబట్టి రిలీజ్ రోజునే వారంతా పెదవి విరిస్తే ఆ ప్రభావం తమిళ ప్రేక్షకుల మీద కూడా పడే అవకాశం ఉందని దిల్ రాజు వెనక్కి తగ్గాడని తెలుస్తోంది.
తమిళ ప్రేక్షకులు ఫ్యామిలీ సినిమాలకు బాగా కనెక్ట్ అవుతారు. మరీ ముఖ్యంగా వారు పొంగల్ గా జరుపుకునే మన సంక్రాంతి సందర్భంగా ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలు హిట్ అవుతూ వస్తాయి. ఈ నేపథ్యంలో రిస్కు తీసుకోవడానికి ఇష్టం లేనిది దిల్ రాజు తమిళంలో ఈ సినిమాని ముందుగా రిలీజ్ చేస్తున్నారని, తమిళ ప్రేక్షకులకు వాళ్ళు ఎలాగో మనం చూసేసిన సినిమాలు గతంలో చూడలేదు కాబట్టి ఈ సినిమా వాళ్లకి బాగా నచ్చితీరుతుందని అలా తమిళంలో హిట్ టాక్ వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులు కూడా సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తారని ఆయన లెక్కలు వేసుకున్నాడని అంటున్నారు. అయితే ఈ విషయం మీద కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. సినిమాల పోలిక పక్కన పెడితే సినిమా ఓవరాల్ గా చాలా బాగుంటుందని దిల్ రాజు చెప్తున్నారు. అయితే ఈ తమిళ తెలుగు లాజిక్కు కరెక్టో కాదో అనేది సినిమా విడుదలైన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read: Vaarasudu Postponed : వారసుడు విడుదల వాయిదా.. అధికారికంగా ప్రకటించననున్న దిల్ రాజు.. ఎందుకంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Varasudu Movie: ఇంతకూ వారసుడు వాయిదాకి అసలు కారణం ఇదా.. పెద్ద స్కెచ్చే ఇది!