Tollywood Team Telugu Warriors Won CCL 2023: గత కొద్ది రోజులుగా సెలబ్రిటీ ఛాంపియన్స్ లీగ్ క్రికెట్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రికెట్ పోటీలకు సంబంధించి తెలుగు వారియర్స్ అలాగే భోజ్పురి దబాంగ్స్ జట్టు ఫైనల్స్ కు వెళ్లాయి. అక్కినేని అఖిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న తెలుగు వారియర్స్ టీం ఎట్టకేలకు భోజ్పురి దబాంగ్స్ టీంని మట్టి కరిపించి సెలబ్రిటీ ఛాంపియన్స్ లీగ్ కప్పు అందుకుంది. వాస్తవానికి ఇప్పటికే ఈ సెలబ్రిటీ ఛాంపియన్స్ లీగ్ సంబంధించిన తొమ్మిది సీజన్లు జరగగా తెలుగు వారియర్స్ టీం కప్ అందుకోవడం ఇది నాలుగోసారి.
అఖిల్ అక్కినేని, అశ్విన్ బాబు, థమన్, రఘు, భోజ్పురి దబాంగ్స్ జట్టు మీద తెలుగు వారియర్స్ జట్టు గెలిచేందుకు కారణమయ్యారు. ఇక ఈ మ్యాచ్ చూసేందుకు టాలీవుడ్ హీరో వెంకటేష్, ఘంటా శ్రీనివాసరావు వంటి వారు వచ్చి తెలుగు వారియర్స్ టీం మొత్తాన్ని చీరప్ చేసి వారి గెలుపుని దగ్గరుండి ఆనందించారు.
ఇక అక్కినేని అఖిల్ ఈ టోర్నమెంట్ మొత్తానికి మూడు సార్లు మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడమే కాక మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా అందుకోవడంతో గాల్లో తేలిపోతున్నారు. అలాగే ఈ టోర్నమెంట్ మొత్తం మీద హైయెస్ట్ రన్స్ సాధించిన ఆటగాడిగా కూడా అఖిల్ అక్కినేని నిలవడంతో అక్కినేని అభిమానులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే ఈ ఏడాది అత్యధిక సిక్సులు కొట్టిన రికార్డు కూడా అఖిల్ పేరు మీద నమోదయింది. ఇక ఈ సెలబ్రిటీ ఛాంపియన్స్ లీగ్ జీటీవీ నెట్వర్క్ లో ఎక్స్ క్లూజివ్ గా టెలికాస్ట్ అయింది. జి అనుమోల్ సినిమా పిక్చర్స్ హిందీ, జీ సినిమా తెలుగు, జీ తమిళ్, జీ బంగ్లా అలాగే జీ5 యాప్ లో కూడా ప్రసారమైంది. అయితే సెలబ్రిటీ క్రికెట్ యూట్యూబ్ ఛానల్ లో మాత్రం ఈ మ్యాచ్ కి సంబంధించిన హైలెట్స్ మాత్రమే ప్రసారమయ్యాయి.
Also Read: Mallareddy Pawan kalyan Offer: పవన్ కళ్యాణ్ విలన్ గా మల్లారెడ్డి.. జస్ట్ లో మిస్ అయిందట?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook