Koffee With Karan: కాఫీ విత్ కరణ్‌లో సమంతపై కీలక వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ

Koffee With Karan: కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో సెలెబ్రిటీలకు చెందిన అంతర్గత, విభిన్న కోణాలు బహిర్గతమౌతుంటాయి. ఇప్పుడు ఇదే కార్యక్రమంలో విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేశాడు. విజయ్ వ్యాఖ్యలిప్పుడు సంచలనంగా మారాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 5, 2022, 08:20 PM IST
Koffee With Karan: కాఫీ విత్ కరణ్‌లో సమంతపై కీలక వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ

టాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దేవరకొండకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ముఖ్యంగా ఉత్తరాది అమ్మాయిలైతే విజయ్ అంటే పడిఛస్తారు. కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్‌లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆ వ్యాఖ్యలేంటో చూద్దాం.

కరణ్ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో చాలా విషయాలు బహిర్గతమౌతుంటాయి. ఈసారి ఈ వేదికపై విజయ్ దేవరకొండ ఆశీనుడయ్యాడు. దక్షిణాది నటుల గురించి విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందుకే ఈ కార్యక్రమం ఇప్పుడు వైరల్ అవుతోంది. కాఫీ విత్ కరణ్ కార్యక్రమం సహజంగానే అందరికీ మంచి ఎంటర్‌టైనింగ్ మసాలా ఇస్తుంటుంది. ఈ కార్యక్రమాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు సెలెబ్రిటీలకు సంబంధించి ఆసక్తికర విషయాలు అడుగుతుంటారు కరణ్. ఈసారి ఈ కార్యక్రమానికి హాజరైన విజయ్ దేవరకొండ, అనన్య పాండేలు ఆసక్తికరక విషయాలు వెల్లడించారు.

విజయ్ దేవరకొండ దృష్టిలో మోస్ట్ డిజైరబుల్ మహిళ ఎవరని కరణ్ ప్రశ్నించగా..ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే దక్షిణాది నటి సమంతా పేరు చెప్పాడు. అదే సమయంలో విజయ్ దేవరకొండ, సమంతల ప్రేమ కధాచిత్రం గురించి కూడా కరణ్ ప్రస్తావించాడు. సమంత పట్ల విజయ్ మనస్సులో మాట ఇదేనని కరణ్ చెప్పడం విశేషం.

కరణ్ జోహార్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ చాలామందికి బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా ఉంటోంది. ఈ షో ద్వారా నచ్చిన సెలెబ్రిటీల గురించి వివిధ కోణాల్లో తెలుసుకునే అవకాశాలున్నాయి. 

Also read: Stunt Man Died: సినిమా షూటింగ్‌లో అపశృతి.. స్టంట్‌మ్యాన్ మృతి.. నోరు విప్పని హీరో, దర్శకుడు, నిర్మాత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News