Vijay Devarakonda: మరణానంతరం అవయవదానం, విజయ్‌పై నెటిజన్ల ప్రశంసలు

Vijay Devarakonda: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై ఇప్పుడు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. లైగర్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. భారీగా స్పందన లభిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2022, 09:49 AM IST
Vijay Devarakonda: మరణానంతరం అవయవదానం, విజయ్‌పై నెటిజన్ల ప్రశంసలు

Tollywood star actor Vijay Devarakonda Donated Organs after his Death: అన్ని దానాల్లో అవయవదానం మిన్న. అందుకే  అభివృద్ధి చెందుతున్న సైన్స్ ఇదే బోదిస్తోంది. ప్రముఖ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ఎందుకో బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. కలెక్షన్ల పరంగా మరీ ఘోరం. సినిమా కోసం విజయ్ చాలా కష్టపడ్డాడు.  లైగర్ సినిమా మిగిల్చిన షాక్ నుంచి తేలుకుని మరోసారి వార్తల్లో నిలిచాడు విజయ్ దేవరకొండ. ఈసారి నలుగురూ మెచ్చే నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. నవంబర్ 14 బాలల దినోత్సవం పురస్కరించుకుని..పేస్ హాస్పిటల్స్, లివర్ పాంక్రియాస్, ఫౌండేషన్ ఆఫ్ పాంక్రియాస్ ఫౌండేషన్  ఆధ్వర్యాన పీడియాట్రిక్ లివర్ ప్లాంటేషన్ అవగాహన కార్యక్రమం ఏర్పాటైంది. 

ఈ కార్యక్రమంలో లైగర్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిధిగా పాల్గొనడమే కాకుండా..అవయవదానం చేస్తున్నట్టు ప్రకటించాడు. మరణం తరువాత మరొకరిలో జీవించేందుకు ఇష్టపడతానన్నాడు. అవయవదానం పత్రంపై గతంలోనే సంతకాలు పూర్తి చేసినట్టు చెప్పారు. 

విజయ్ దేవరకొండ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. విజయ్ మనసు పెద్దదని కొనియాడుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ అప్‌కమింగ్ సినిమా ఖుుషీలో సమంతతో కన్పించనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

Also read: Ananya Panday: బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే హాట్ షో.. మీరూ ఓ లుక్కేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News