Pushpa Movie at 150 Crores Club: 150 కోట్ల క్లబ్‌కు చేరువలో దూసుకెళ్తున్న పుష్ప సినిమా

Pushpa Movie at 150 Crores Club: బాక్సాఫీసు వద్ద దూసుకుపోతున్న లెక్కల మాస్టారి చిత్రం పుష్ప టార్గెట్ 150 క్రోర్స్ దిశగా ముందుకెళ్తోంది. దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధిస్తున్న పుష్ప సినిమా ఇప్పటికే వందకోట్ల క్లబ్ దాటేసింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 20, 2021, 11:36 AM IST
Pushpa Movie at 150 Crores Club: 150 కోట్ల క్లబ్‌కు చేరువలో దూసుకెళ్తున్న పుష్ప సినిమా

Pushpa Movie at 150 Crores Club: బాక్సాఫీసు వద్ద దూసుకుపోతున్న లెక్కల మాస్టారి చిత్రం పుష్ప టార్గెట్ 150 క్రోర్స్ దిశగా ముందుకెళ్తోంది. దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధిస్తున్న పుష్ప సినిమా ఇప్పటికే వందకోట్ల క్లబ్ దాటేసింది.

లెక్కల మాస్టారు సుకుమార్, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కాంబినేషన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైన పుష్ప సినిమా పార్ట్ 1 దూసుకుపోతోంది. మెగా హిట్‌టాక్‌తో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ భారీగా వసూళ్లు వస్తున్నాయి. పుష్ప సినిమా విడుదలైన తొలి రెండ్రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. మూడవరోజు కూడా భారీగా కలెక్షలు సాధించింది. తమిళనాడులో పుష్ప సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. తమిళనాడులో తొలి రెండ్రోజుల్లోనే పది కోట్ల క్లబ్‌లో చేరింది. ఇంతకుముందు ఈ ఘనత సాధించిన చిత్రాల్లో బాహుబలి, స్పైడర్, బాహుబలి 2, సాహో ఉన్నాయి. 

ఇక కేరళలో కూడా పుష్ప సినిమా(Pushpa Movie)భారీగా వసూళ్లు రాబడుతోంది. కేరళలో తొలి రెండ్రోజుల్లోనే 3.5 కోట్లు వసూలు చేసింది. మూడవ రోజున మాత్రం ఏకంగా 1.5 కోట్ల కలెక్షన్ వచ్చి చేరింది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లోని హిందీ వెర్షన్‌లో పుష్ప మూడు రోజుల్లో 4 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ విషయంలో ప్రీమియర్ షోల ద్వారా 543 డాలర్లు సాధించింది. తొలిరోజు 430 డాలర్లు, రెండవరోజున 390 డాలర్ల మార్కెట్ షేర్ సాధించింది. ఓవరాల్‌గా పుష్ప సినిమా షేర్ పరంగా 70 కోట్లు, గ్రాస్ కలెక్షన్ పరంగా 100 కోట్లు(100 Crores Club)వసూలు చేసింది. ఇప్పటి వరకూ పుష్ప సినిమా చేసిన బిజినెస్ అక్షరాలా 144 కోట్లు. మరో 70 కోట్లు గడిస్తే..సినిమా లాభాల్లో ఉంటుంది. మరో రెండ్రోజుల్లోనే ఆ ఘనత కూడా సాధించనుందని తెలుస్తోంది. 

నైజాం ప్రాంతంలో పుష్ప సినిమా భారీగా వసూళ్లు(Record level Collections)చేస్తోంది. తొలి రెండ్రోజులకే 18.84 కోట్లు కలెక్షన్ వచ్చింది. మూడవరోజున మరో 5 కోట్లు రాబట్టింది. ఇక ఆంధ్రా సీడెడ్ జిల్లాల్లో భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. విశాఖ జిల్లాలో మూడవ రోజున 28 కోట్లు, కృష్ణా జిల్లాలో 80 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికే వందకోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ఇప్పుడు టార్గెట్ 150 కోర్స్ దిశగా ముందుకు సాగుతోంది. త్వరలోనే అంటే నాలుగైదురోజుల్లోనే 150 కోట్ల క్లబ్‌లో చేరవచ్చని తెలుస్తోంది. ఇంత త్వరగా వందకోట్ల క్లబ్ దాటడం బాహుబలి(Bahubali)తరువాత ఇదేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 

Also read: Bigg Boss Telugu Season 6 Update: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 ఎప్పుడో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News