Tollywood Movies Releasing: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు ఇదే!

Tollywood Movies Releasing in Theaters this week: ఈ వారం థియేటర్లలో, ఒటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 19, 2022, 02:08 PM IST
Tollywood Movies Releasing: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు ఇదే!

Tollywood Movies Releasing in Theaters this week: తెలుగులో విడుదల కావాల్సిన పెద్ద సినిమాలు ఇప్పటికే విడుదలవడంతో చిన్న సినిమాలు పెద్ద ఎత్తున రిలీజ్ కావడానికి దర్శక నిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ప్రతి వారం డజన్ల కొద్ది సినిమాలు విడుదలవుతున్నాయి ఇక ఈ వారం కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు మరిన్ని సినిమాలు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక ఈ శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు ఏ ఏ సినిమాలు రాబోతున్నాయి అనే విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

లక్ష్య సినిమాతో చివరిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన నాగశౌర్య ఈసారి కృష్ణ వ్రిందా విహారి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. షెర్లీ షెటియా జంటగా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈనెల 23వ తేదీన రాబోతోంది. ఇక మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు హీరోగా కయాదు లోహార్ హీరోయిన్ గా అల్లూరి అనే సినిమా ఈ నెల 23వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

తనికెళ్ల భరణి, సుమన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించగా అర్జున్ రెడ్డి ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ కూడా హాజరు కావడంతో సినిమా మీద కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. మత్తు వదలరా, తెల్లవారితే గురువారం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహ కోడూరి ప్రీతి అస్రాని ప్రధాన పాత్రలలో రూపొందిన దొంగలున్నారు జాగ్రత్త సినిమా కూడా 23వ తేదీ విడుదలవుతోంది.

సముద్రఖని కీలకపాత్రలో నటించిన ఈ సినిమాకు సతీష్ త్రిపుర దర్శకత్వం వహించగా శ్రీ సింహా సోదరుడు కాలభైరవ సంగీతం అందించారు. సూపర్ హిట్ సినిమా మాతృదేవోభవ టైటిల్ తోనే మాతృదేవోభవ అనే మరో సినిమా రిలీజ్ అవుతోంది. సుధా, చమ్మక్ చంద్ర, రఘుబాబు ప్రధాన పాత్రలలో  నటించిన ఈ సినిమాకు హరినాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈనెల 24వ తేదీన రాబోతోంది. అలాగే అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా పగ పగ పగ అనే సినిమా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా 22వ తేదీన విడుదల కాబోతుండగా మొదటి షో అందరికీ ఉచితం అని సినిమా యూనిట్ ప్రకటించింది.

Tollywood Movies and Web Series Releasing in OTT this week: ఇక ఈ సినిమాలతో పాటు ఓటీటీలో కూడా  పలు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/ వెబ్‌సిరీస్‌ల విషయానికి వస్తే నెట్‌ఫ్లిక్స్‌ లో ద పెర్‌ఫ్యూమర్‌ అనే హాలీవుడ్‌ సినిమా సెప్టెంబరు 21, జంతరా అనే హిందీ సిరీస్‌ సెప్టెంబరు 23న రిలీజ్ అవుతోంది, ఎల్‌వోయూ అనే ఒక హాలీవుడ్ సినిమా సెప్టెంబరు 23న రిలీజ్ అవుతున్నాయి.

ఇక డిస్నీ+హాట్‌స్టార్‌ లో సెప్టెంబరు 21న అందోర్‌ వెబ్‌సిరీస్‌, సెప్టెంబరు 22న ద కర్దాషియన్స్‌ అనే వెబ్‌సిరీస్‌2, సెప్టెంబరు 23న బబ్లీ బౌన్సర్‌ అనే తెలుగు సినిమా విడుదల అవుతున్నాయి. ఆహా లో సెప్టెంబరు 23న ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో సినిమా, అదే రోజున డైరీ అనే తమిళ సినిమా రిలీజ్ అవుతున్నాయి. ఇక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో సెప్టెంబరు 20న డ్యూడ్‌ అనే హిందీ సిరీస్‌, సెప్టెంబరు 22న హుష్‌ హుష్‌ అనే హిందీ సిరీస్‌ రిలీజ్ అవుతున్నాయి. ఇక జీ5లో సెప్టెంబరు 22న అతిథి భూతో భవ అనే హిందీ సినిమా రిలీజ్ అవుతోంది.

Also Read: Tollywood Movies Releasing: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు ఇదే! 

Also Read: Varun Tej 13: ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా వరుణ్ తేజ్.. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా మూవీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News