Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో లాంగ్ ఎవైటెడ్ కాంబినేషన్ త్వరలో ఉంటుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఆ ఇద్దరు అగ్రనటుల మధ్య ఉన్న స్నేహబంధం తెరపై కన్పించవచ్చని తెలుస్తోంది. ఆ వివరాలు పరిశీలిద్దాం.
టాలీవుడ్లో మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య సినిమా విడుదలైన ప్రతిసారీ ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్సలు చేసుకుంటారు. అయితే ఈ ఇద్దరు హీరోల మధ్య మాత్రం ఆ పరిస్థితి ఎప్పుడూ లేదు. ఈ ఇద్దరూ మంచి స్నేహితుల అనే కంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనడం మంచిది. ఏదో ఒక సందర్బంగాలో ఈ ఇద్దరూ కానుకలు ఇచ్చిపుచ్చుకుంటుంటారు. ప్రతియేటా ఇప్పటికీ పవన్ కళ్యాణ్..తన తోటలో పండించిన మామిడి పండ్లను చిరంజీవికి పంపిస్తుంటారు. క్రిస్మస్ సందర్బంగా ఒకరికొకరు బహుమతులు పంపించుకుంటారు. క్రిస్మస్ సందర్భంగా మహేశ్ ఇంటికి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కానుకలు పంపించాడు. ఈ కానుకలపై స్పందించిన నమ్రతా శిరోద్కర్..పవన్‌కు ధన్యవాదాలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. థాంక్యూ పవన్ అన్నా..ఫర్ ది లవ్ లీ హ్యాంపర్ అంటూ.
అదే సమయంలో అభిమానులు తమ కోరికను నమ్రత ముందు వ్యక్తపరిచారు. పవన్ -మహేశ్(Mahesh Babu)మల్టీస్టారర్ సినిమా ఎప్పుడుంటుందని అడిగారు. ఈ అద్భుతానికి కనీసం మీరైనా పూనుకోండి అంటూ అభిమానులు కామెంట్లు పెట్టారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చే ఏడాది అంటే 2022లో సినిమా ఉండవచ్చని తెలుస్తోంది. అటు అభిమానుల్నించి కూడా పెద్దఎత్తున ఇదే డిమాండ్ వస్తోంది. పవన్-మహేశ్‌లను ఒకే స్క్రీన్‌పై చూడాలనేది అభిమానుల కోరిక. ఈ కోరిక ఎంతవరకూ నెరవేరుతుందో చూడాలి మరి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి