Trivikram: సంయక్త మీనన్ అందానికి పడిపోయిన త్రివిక్రమ్, అందరి సమక్షంలో లవ్ యు చెప్పిన మాటల మాంత్రికుడు

Trivikram: టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ గురించి అందరికీ తెలిసిందే. ఇతడో మాటల మాంత్రికుడు. మాటల్తో మాయే కాదు..మనసులో మాటల్ని కూడా చెప్పేయగలనని నిరూపించేశాడు. మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ప్రేమలో పడిపోయాడు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 16, 2023, 10:23 AM IST
Trivikram: సంయక్త మీనన్ అందానికి పడిపోయిన త్రివిక్రమ్, అందరి సమక్షంలో లవ్ యు చెప్పిన మాటల మాంత్రికుడు

మాటల్తో అనుకున్నది చెప్పేయడం, ఆ తరువాత అదే మాటల్తో మాయ చేయడం తెలుగు సినీ పరిశ్రమలో త్రివిక్రమ్‌కు వచ్చినంతగా మరెవరికీ రాదనుకుంటా. అందుకే అతడిని మాటల మాంత్రికుడిగా పిలుస్తుంటారు.  సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ చెప్పిన మాటలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

భీమ్లానాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కేరళ బ్యూటీ సంయుక్త మీనన్ నిజంగానే అపురూప సౌందర్యరాశి. అందంలోనే కాదు అభినయం కూడా అద్భుతం. చక్కని ఫిజిక్ ఉన్న సంయుక్త తెలుగులో అగ్రనటిగా ఎదిగే అవకాశాలు చాలానే ఉన్నాయి. అందమైన కళ్లు, అందమైన నవ్వు, చక్కని ఫిజిక్ చూస్తే ఎవరు ఆకర్షణకు లోనుకారో చెప్పండి. అందుకే మన మాటల మాంత్రికుడు కూడా ఆమెకు ఫిదా అయిపోయాడు. స్టేజ్‌పైనే అందరి ముందూ లవ్ యు చెప్పేశాడు.

సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో ఎస్ఎస్ఎంబి 28 చేస్తున్న త్రివిక్రమ్..ధనుష్ నటించిన సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ధనుష్‌ని బెస్ట్ యాక్టర్‌గా అభివర్ణించాడు. ఆ తరువాత వేదికపై ఉన్న ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాడు. తెల్లటి చీరలో ధగధగా మెరిసిపోతున్న సంయుక్త మీనన్ గురించి ప్రస్తావిస్తూ..మొదటి మాటలోనే లవ్ యు అనేశాడు. దాంతో అక్కడంతా అభిమానుల అరుపులు, కేకలు, ఈలలు మార్మోగిపోయాయి. అభిమానుల ఉద్దేశ్యం అర్ధమైనట్టుంది ఈ మాటల మాంత్రికుడికి. ఆగండి..కంగారు పడకండి పూర్తిగా వినండంటూ మాటలు కొనసాగించాడు.

నీ తరపున నా భార్యకు హాయ్ చెప్పానంటూ ముగించాడు. ఇదేమీ అర్ధం కాక అభిమానులు సందిగ్దంలో పడ్డారు. లవ్ యు చెప్పింది సంయుక్త మీనన్‌కే కదా..మరి ఆ మాత్రం దానికి ఆగండి అనడమెందుకని అభిమానులకు సందేహాలొస్తున్నాయి. ఈ మాటల మాంత్రికుడు మాటల్లో సర్ది చెప్పే ప్రయత్నం చేసినా..సంయుక్త మీనన్ అందానికి ఫిదా అయిపోయాడనేది మాత్రం నిజమేననే గుసగుసలు విన్పిస్తున్నాయి. అందుకే మనసులో ఉంది కాబట్టే..లవ్ యు మాటొచ్చేసిందని అంటున్నారు.

Also read: Janhvi Kapoor for NTR 30: ఎన్టీఆర్ కోసం జాన్వీ కపూర్..ఫోటోషూట్ కూడా పూర్తి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News