Siggendukura Mama Song: సిగ్గెందుకురా మామా మాస్ సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ సుకుమార్

Siggendukura Mama Song from SR Kalyanamandapam: ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా నుంచి మూడో పాట విడుదలైంది. సిగ్గెందుకురా మామా సాంగ్‌ను టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన సాంగ్ ఇక్కడ వీక్షించండి.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 22, 2021, 07:11 PM IST
Siggendukura Mama Song: సిగ్గెందుకురా మామా మాస్ సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ సుకుమార్

Siggendukura Mama Song from SR Kalyanamandapam: రాజావారు రాణిగారు ఫేమ్ కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఎస్ఆర్ కళ్యాణమండపం. ట్యాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జువాల్కర్ హీరోయిన్. కిరణ్ అబ్బవరం స్టోరీ, స్క్రీన్‌ప్లే బాధ్యతలు సైతం తనే నిర్వహించాడని డైరెక్టర్ సుకుమార్ ప్రశంసించాడు. శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. 

ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా నుంచి మూడో పాట విడుదలైంది. సిగ్గెందుకురా మామా సాంగ్‌ను టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు. Tollywoodలో బెస్ట్ లిరిక్ రైటర్స్‌లో ఒకరైన భాస్కరభట్ల సాహిత్యం అందించిన సాంగ్ ‘తిట్టినా బాగుంటాది కొట్టినా బాగుంటాది గర్ల్‌ఫ్రెండ్ ఏం చేసినా గారాబంగా ఉంటది’ సాంగ్‌ను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. చైతన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను లహరి మ్యూజిక్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. సిగ్గెందుకురా మామా సాంగ్ ఇక్కడ వీక్షించండి.  

Also Read: Manchu Vishnu, MAA association: మా అసోసియేషన్ ఎన్నికలు సమరంలో మంచు విష్ణు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook  

Trending News