Koratala shiva NTR Movie: ఎన్టీఆర్ సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్ సిద్ధం చేసిన కొరటాల శివ

Koratala shiva NTR Movie: టాలీవుడ్ అగ్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్-స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తోంది. ఈ సినిమాకు ఓ పవర్‌ఫుల్ టైటిల్ సిద్ధం చేసుకున్నాడు కొరటాల. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 12, 2022, 11:09 PM IST
Koratala shiva NTR Movie: ఎన్టీఆర్ సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్ సిద్ధం చేసిన కొరటాల శివ

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరోసారి హిట్ కాంబినేషన్ సినిమా వస్తోంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ..జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు..సినీ అభిమానులందరిలో ఇప్పుడు దృష్టంతా జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ సినిమాపైనే ఉంది. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. రోజూరోజూకూ సినిమాపై చర్చ పెరిగేకొద్దీ అంచనాలు పెరిగిపోతున్నాయి. కొరటాల శివకైతే ఈ సినిమా చాలా ముఖ్యం. అతని కెరీర్‌ను నిర్ణయించేది ఈ సినిమానే. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా రూపంలో అతిపెద్ద డిజాస్టర్ మూటగట్టుకున్నారు కొరటాల శివ. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాపై పూర్తి ఫోకస్ సారించారు.

ఈ సినిమా కోసం కొరటాల శివ ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే..టైటిల్ సెలెక్షన్ కూడా అద్భుతంగా ఉంది. అది కూడా మరో నిర్మాత నుంచి తీసుకున్నారు. గతంలో నిర్మాత బండ్ల గణేశ్ దేవర అనే టైటిల్‌ను ఫిల్మ్ ఛాంబర్‌లో నమోదు చేసి ఉన్నాడు. ఆ తరువాత రెన్యువల్ కూడా మర్చిపోయాడు. దేవర టైటిల్ సౌండింగ్ బాగుందనే అభిప్రాయంతో జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసం కొరటాల శివ ఈ టైటిల్ తీసుకున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. 

Also read: Ram Charan on Acharya: కంటెంటే కింగ్.. అందుకే ఆ సినిమాను చూడలేదు.. రామ్ చరణ్ పరోక్ష కామెంట్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News