Pragathi Mahavadi: ఆ ఒక్క కారణంతోనే హీరోయిన్‌గా నటించొద్దని నిర్ణయించుకున్నా.. ప్రగతి సంచలన వ్యాఖ్యలు!

Pragathi Mahavadi interesting comments about Heroine Role. హీరోయిన్‌గా నటించకుండా.. మదర్‌ రోల్స్‌ చెయడానికి అసలు కారణం ఏంటో ప్రగతి మహావాడి చెప్పారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 25, 2022, 11:55 AM IST
  • హీరోయిన్‌గా నటించొద్దని నిర్ణయించుకున్నా
  • ప్రగతి సంచలన వ్యాఖ్యలు
  • అమ్మ, అత్త పాత్రలకు వన్నెతెచ్చారు
Pragathi Mahavadi: ఆ ఒక్క కారణంతోనే హీరోయిన్‌గా నటించొద్దని నిర్ణయించుకున్నా.. ప్రగతి సంచలన వ్యాఖ్యలు!

Tollywood Actress Pragathi Mahavadi reveals Why she is not act as a Heroine: ప్రగతి మహావాడి.. ఈ పేరు గురించి తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లో గ్లామరస్‌ మదర్‌గా ప్రగతి ఆకట్టుకుంటున్నారు. హీరోహీరోయిన్లకు అమ్మ, అత్త పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించారు. తనదైన సహజ నటన, మాటలతో అమ్మ, అత్త పాత్రలకు వన్నెతెచ్చారు. గతకొంత కాలంగా ప్రతి సినిమాలో ప్రగతి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమాని సోషల్‌ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన ప్రగతి.. అప్పటినుంచి అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు. 

డాన్స్, ఫిట్‌నెస్‌ సాధన చేస్తూ సోషల్‌ మీడియాలో ప్రగతి మహావాడి రచ్చ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వెండితెరపై కంటే.. సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌తో ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు. ముఖ్యంగా డాన్స్ విషయంలో. తాజాగా ఓ టాక్‌ షోలో పాల్గొన్న ప్రగతి.. తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. మొదట హీరోయిన్‌గా నటించకుండా.. మదర్‌ రోల్స్‌ చెయడానికి అసలు కారణం ఏంటో ఆమె చెప్పారు. 

'ఒక హీరోతో రెయిన్ సీన్ చేయాలని చిత్ర యూనిట్ అడిగారు. కాస్ట్యూమ్స్ విషయంలో నేను కాస్త అభ్యంతరం చెప్పాను. అప్పుడు హీరో చేసిన వ్యాఖ్యలు నాకు అస్సలు నచ్చలేదు. ఆ పాట చేయకుండా అక్కడినుంచి వెళ్లిపోయా. ఆ సంఘటనతో ఇకపై హీరోయిన్‌గా నటించొద్దని నిర్ణయించుకున్నా. అందుకే తల్లి, అత్త  పాత్రలు.. సీరియల్స్ చేయడం మొదలుపెట్టా. నా నటనతో చాలా సంతోషంగా ఉన్నా. ఇంకా నటిస్తూనే ఉంటా' అని ప్రగతి మహావాడి చెప్పారు. 

‘తొలిసారి నేను అమ్మ పాత్ర చేసినప్పుడు నా వయసు 24. నాకు చాలా బాధ వేసింది. మేకప్‌ అయ్యాక సెట్‌కి వెళితే.. డైరెక్టర్‌ నన్ను చూసి  షాక్ అయ్యాడు. ముడి వేసుకుని రమ్మంటే.. జడ వేసుకుని వచ్చిందన్నారు. ఆ మాటలు నన్ను బాధించాయి. ఎందుకంటే.. అప్పటికే నేను కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించా. నా వయసు ఉన్న హీరోయిన్స్‌కి నేను తల్లి పాత్రలు చేయాల్సి వచ్చింది. డైరెక్టర్‌ అలా అందంతో మేకప్‌ రూంకు వెళ్లి వెక్కివెక్కి ఏడ్చా. ఆ తర్వాత తల్లి పాత్రలను గౌరవించడం మొదలెట్టా' అని ప్రగతి చెప్పుకొచ్చారు. 

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లి సలహాను పాటించని అశ్విన్‌.. చాలా తెలివిగా పాకిస్థాన్‌కు చెక్  

Also Read: RBK Jobs 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా కేంద్రాల్లో భారీగా ఉద్యోగాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News