Radhe shyam: రాధేశ్యామ్ సినిమా కధ టైటానిక్ లాంటిదేనా

Radhe shyam: రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్‌పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. భారీ అంచనాలున్న సినిమా కథకు నేపధ్యం ఆ పాత ఇంగ్లీషు సినిమానే అని తెలుస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 23, 2021, 08:22 PM IST
Radhe shyam: రాధేశ్యామ్ సినిమా కధ టైటానిక్ లాంటిదేనా

Radhe shyam: రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్‌పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. భారీ అంచనాలున్న సినిమా కథకు నేపధ్యం ఆ పాత ఇంగ్లీషు సినిమానే అని తెలుస్తోంది.

బాహుబలితో(Bahubali) పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ (Prabhas) వరుస పాన్ ఇండియా సినిమాలతో (Pan india movies) బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాతో బిజీగా ఉన్న పరిస్థితి. ఇప్పటికే విడుదలైన రాధేశ్యామ్ ఫస్ట్‌లుక్(Radhe shyam first look)అందర్నీ ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే ఓ మెడికోగా నటిస్తోందని తెలుస్తోంది. భారీ అంచనాలున్న ఈ సినిమా కధలో బ్యాక్ గ్రౌండ్ అంతా ఇంగ్లీషు సినిమా టైటానిక్ అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కొత్తగా పునర్జన్మల నేపధ్యం ఉంటుందని సమాచారం. సముద్రంలో షిప్ యాక్సిడెంట్‌కు గురవుతుందని..ఆ ప్రమాదానికి సంబంధించిన ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని పరిశ్రమలో టాక్ విన్పిస్తోంది. సినిమా కధ మొత్తం ఈ ప్రమాదపు ఎపిసోడ్ నుంచే మలుపు తిరుగుతుందట. 

ఈ సీన్ ఏకంగా 30 నిమిషాలసేపు ఉంటుంది. రాధేశ్యామ్ సినిమా (Radhe shyam movie) బడ్జెట్ కూడా భారీగానే ఉంది. అందుకే ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి. మరోవైపు ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాతో, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలో(Adipurush movie) నటిస్తున్నాడు. 

Also read: Keerthy Suresh: కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న మహానటి ఫేమ్ కీర్తి సురేష్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News