Manchu Vishnu: మంచు విష్ణు ఆఫీస్‌లో చోరీ... రూ.5లక్షలు విలువ చేసే సామాగ్రి మాయం..

Theft at Manchu Vishnu office: 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు ఆఫీస్‌లో చోరీ కలకలం రేపుతోంది. హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని ఆయన ఆఫీస్‌లో ఈ చోరీ జరిగింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2022, 11:13 PM IST
  • మంచు విష్ణు కార్యాలయంలో చోరీ
  • రూ. 5 లక్షలు విలువ చేసే సామాగ్రి మాయం
  • జూబ్లీహిల్స్ పోలీసులకు అందిన ఫిర్యాదు
Manchu Vishnu: మంచు విష్ణు ఆఫీస్‌లో చోరీ... రూ.5లక్షలు విలువ చేసే సామాగ్రి మాయం..

Theft at Manchu Vishnu office: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, సినీ నటుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ జరిగినట్లు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. విష్ణు కార్యాలయంలో రూ.5 లక్షలు విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి చోరీకి గురైనట్లు ఆయన మేనేజర్ సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విష్ణు వద్ద హెయిర్ డ్రెస్సర్‌గా పనిచేసే నాగ శ్రీనుపై సంజయ్ అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చోరీ కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం. 

ఇదిలా ఉంటే, మంచు విష్ణు 10 రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నేత్రుత్వంలోని టాలీవుడ్ ప్రముఖులు సీఎం జగన్‌తో భేటీ అయిన కొద్దిరోజులకే విష్ణు కూడా ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే సీఎంను తాను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు తెలిపారు. ఇది వ్యక్తిగత మీటింగ్ మాత్రమేనని వెల్లడించారు. తిరుపతిలో స్టూడియో నిర్మించనున్నట్లు చెప్పుకొచ్చారు.

చిరు నేత్రుత్వంలోని బృందంతో భేటీ తర్వాత సినిమా టికెట్ల రేట్ల పెంపుకు సీఎం జగన్ సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు జీవో ఇస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్‌తో భేటీలో మంచు విష్ణు కూడా ఇదే అంశంపై చర్చించవచ్చునని అంతా భావించారు. కానీ విష్ణు మాత్రం అది వ్యక్తిగత భేటీ అని తేల్చేశారు. ఇక ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి ఇప్పటికైతే జీవో జారీ చేయలేదు. మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో జీవో ఆలస్యమైనట్లు చెబుతున్నారు. మరోవైపు, భీమ్లా నాయక్ రిలీజ్ అవడంతో.. పవన్‌పై కక్ష సాధింపులో భాగంగానే కొత్త జీవో జారీలో జాప్యం చేస్తున్నారనే విమర్శలు ప్రభుత్వంపై వినిపిస్తున్నాయి. 

Also Read: Maha Shivaratri: మహా శివరాత్రి రోజు ఏ నైవేద్యం పెట్టాలి.. ఏది పెడితే ఆ పరమ శివుడి అనుగ్రహం పొందగలరు..

Also Read: Russia Ukraine War: బెలారస్ వేదికగా చర్చలకు సిద్ధమైన రష్యా, ఉక్రెయిన్... యుద్ధానికి తెరపడేనా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News