This Week Theatrical Releases: డిసెంబర్ నెల నుంచి థియేటర్ల దగ్గర పెద్ద సినిమాలు సందడి చేస్తూ వచ్చాయి. సంక్రాంతి బరిలో కూడా పెద్ద సినిమాల హవా ఎక్కువగా కనిపించింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చిన్న సినిమాగా బరిలోకి దిగిన హనుమాన్ రికార్డు స్థాయి కలెక్షన్స్ నమోదు చేసుకుంది. ఇక రీసెంట్ గా రిపబ్లిక్ డే సందర్భంగా ధనుష్ డబ్బింగ్ సినిమాతో పాటు హిందీ మూవీ ఫైటర్ విడుదల అయింది. అయితే తెలుగు బాక్స్ ఆఫీస్ పై వాటి కలెక్షన్స్ ప్రభావం పెద్దగా లేదు. ఈ నేపథ్యంలో ఈవారం థియేటర్లలో సందడి చేయడానికి ఏకంగా 10 చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి.
నెక్స్ట్ వీక్ నుంచి ఎలాగో మీడ్ రేంజ్ హీరోల సినిమాల దగ్గర నుంచి పెద్ద సీనియర్ హీరోలు సినిమాల వరకు విడుదలకు. కాబట్టి ఇక మిగిలింది ఈ వారమే అలానే ఇదే మంచి ఛాన్స్ అని భావించిన దాదాపు పది చిన్న సినిమాలు ఒక్కసారిగా థియేటర్ల పై దాడి చేస్తున్నాయి. టాలీవుడ్ లో సినిమాల ట్రెండ్ మారడం మనం చూస్తున్నాం. పెద్ద ..చిన్న సంబంధం లేకుండా.. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే చాలు సినిమాలను ఇట్టే హిట్ చేసేస్తున్నారు ఆడియన్స్. అదే నమ్మకంతో ప్రస్తుతం పది చిన్న చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి. అయితే ఈ పది సినిమాలు కూడా ఒకేసారి విడుదల కావడం గమనార్హం. మరి ఫిబ్రవరి 2న విడుదల అయ్యే ఆ 10 సినిమాలేంటో ఓ లుక్కేద్దాం పదండి.
విడుదలయ్యే పది సినిమాలలో చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా ఉంది అంటే సుహాస్, శివాని కాంబోలో వస్తున్న అంబాజీపేట మ్యారేజిబ్యాండ్. మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించే సుహాస్ మూవీ అంటే బజ్ బాగానే ఉంటుంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ బాగా ఆకట్టుకోవడంతో చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఆ తరువాత బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ మూవీ ‘బూట్‌కట్ బాలరాజు’ పై కూడా మంచి హైప్ ఉంది
అలాగే గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై గీతానంద్, నేహా సోలంకి కాంబో లో వస్తున్న మూవీ గేమ్ ఆన్. మాంచి యాక్షన్.. రొమాంటిక్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పై అంచనాలు బాగానే ఉన్నాయి.
లక్ష్ చదలవాడ హీరో గా తెరకెక్కిన ‘ధీర’ సినిమా కూడా ఫిబ్రవరి 2న రానుంది. ఈ సినిమాపై ముందుగా అంచనాలు లేకపోయినా ఈ మధ్య ఈ చిత్రాన్ని కొన్ని ప్రాంతాలలో దిల్ రాజ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకోవడంతో ఈ సినిమాపై కూడా సుమారుగా అంచనాలు ఏర్పడుతున్నాయి. కామెడీ థ్రిల్లర్ మూవీ ‘కిస్మత్’ కూడా అదే రోజు వస్తుంది. ఈ మూవీ లో
నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా‘హ్యాపీ ఎండింగ్, మెకానిక్, చిక్లెట్స్, ఉర్వి, శంకర ఇలా 10 సినిమాలు..ఓకే రోజు విడుదవుతున్నాయి.
మరి అసలు ఈ చిత్రాలకు థియేటర్స్ దొరుకుతాయా.. దొరికితే వీటీలో ఎన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో.. తెలియాలి అంటే ఈ వారంతారం వరకు వేచి చూడాలి.
Also Read: Four Working Days: ఉద్యోగులకు శుభవార్త.. ఇక కేవలం నాలుగంటే 4 రోజులు పని చేస్తే చాలు
Also Read: PM Kisan Budget 2024: రైతులకు ప్రధాని మోదీ భారీ కానుక.. బడ్జెట్‌లో తీపి కబురు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి