Theatre OTT Movies in this week: ఈ వారం థియేటర్స్‌తో పాటు ఓటీటీలో చిన్న చిత్రాల హడావుడి కనిపించబోతుంది. ఎగ్జామ్స్ సీజన్స్ కాబట్టి బడా సినిమాలేవి విడుదల కావడం లేదు. దీంతో థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి. దీంతో చిన్న చిత్రాలు వరదలా ప్రేక్షకుల మీదికి పోటెత్తున్నాయి. ఈ వారం విడుదలయ్యే చిత్రాల్లో అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'రజాకార్'. 1947 నుంచి 1948 వరకు హైదరాబాద్ సంస్థానంలో మెజారిటీ ప్రజలపై నిజాం ప్రైవేటు సైన్యం చేసిన అరాచకాల నేపథ్యంలో 'రజాకార్' మూవీ తెరకెక్కింది. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 1947లో బ్రిటిష్ వాళ్లు వెళుతు వెళతూ.. దేశాన్ని భారత్, పాకిస్థాన్ అంటూ రెండు దేశాలుగా విభజించి స్వాతంత్య్రం ఇచ్చారు. అప్పటికే దేశంలో 500పైగా స్వతంత్ర్య సంస్థనాలను వాళ్ల ఇష్ట ప్రకారం భారత్‌లో కానీ.. పాకిస్థాన్‌లో కానీ.. లేదా విడిగా ఉండొచ్చని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటన చేసి మరీ వెళ్లింది. ఇక దేశానికి తొలి హోంమంత్రిగా పనిచేసిన సర్ధార్ వల్లభ్ బాయ్ పటేల్ అత్యంత చాకచక్యంతో దేశంలోని 500 పైగా సంస్థానాధీశులతో మాట్లాడి మన దేశంలో విలీనమయ్యేలా చేసారు. కానీ దేశంలో కశ్మీర్, జునాఘడ్, హైదరాబాద్ సంస్థానలు మన దేశంలో విలీనం కాకుండా మొండి కేసాయి. కానీ స్వాతంత్య్రం వచ్చిన కొన్ని రోజులకే కశ్మీర్ పై పాకిస్థాన్ వాళ్లు అటాక్ చేసారు. అపుడు కశ్మీర్ రాజు మన దేశంలో కలుస్తానని ప్రకటన చేసారు. ఆ తర్వాత జునాఘడ్ కూడా భారత్‌లో విలీనమైంది.కానీ హైదారబాద్‌ను పరిపాలిస్తోన్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం హైదరాబాద్‌ను పాకిస్థాన్‌లో విలీనం చేస్తానని ప్రకటన చేసారు. అప్పటి ఆగడాలపై రజాకార్ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెల 15న ప్రపంచ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.
అటు సాయి రామ్ శంకర్ హీరోగా నటించిన 'వెయ్ దరువెయ్' సినిమా కూడా ఈ నెల 15న థియేటర్స్‌లో విడుదల కానుంది. అటు అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటించిన తంత్ర మూవీ కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు చైతన్య రావు హీరోగా నటించిన 'షరతులు వర్తిస్తాయి' కూడా ఈ వీక్ బాక్సాఫీస్ పరీక్షకు రెడీ అవుతోంది. మరోవైపు లైన్ మ్యాన్, రవికుల రఘురామ, లంబసింగి, ప్రేమలో ఇద్దరు వంటి చిత్రాలు ప్రేక్షకుల తీర్పు కోసం ఈ వారమే థియేటర్స్‌లో సందడి చేయబోతున్నాయి.
బాలీవుడ్ విషయానికొస్తే.. సిద్ధార్ధ్ మల్హోత్ర, రాశీ ఖన్నా, దిశా పటానీ హీరోయిన్స్‌గా నటించిన సినిమా 'యోధ'. పూర్తి యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 15 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీటితో పాటు కుంగ్ ఫూ పాండా', మాయా 2024 చిత్రాలు కూడా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. అటు హనుమాన్ ఈ శుక్రవారం నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. మొత్తంగా ఈ వారం విడుదల కాబోతున్న చిత్రాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ విజేతగా నిలుస్తుందో చూడాలి.
Also read: Siddham Meeting: మీరు కృష్ణుడు.. నేను అర్జునుడిని.. కురుక్షేత్రానికి సిద్ధమా?: వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Theatre OTT Movies in this week: రజాకార్, హనుమాన్ సహా ఈ వారం థియేటర్ ఓటిటి లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే..