Radhe Shyam Making Video: రాధేశ్యామ్‌ మేకింగ్ వీడియో.. ఇండియాలోనే ఇటలీని చూపించేశారుగా!!

Radhe Shyam Making video: తాజాగా 'రాధేశ్యామ్' టీమ్ ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. కరోనా కారణంగా యూరప్‌లో షూటింగ్‌ ఆగిపోవడంతో.. ఇండియాలో యూరప్‌ సెట్‌ వేసి మరీ షూటింగ్‌ చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2022, 03:30 PM IST
  • మార్చి 11న రాధేశ్యామ్‌ విడుదల
  • కొత్త ప్రపంచాన్ని సృష్టించారుగా
  • ఇండియాలోనే ఇటలీని చూపించేశారు
Radhe Shyam Making Video: రాధేశ్యామ్‌ మేకింగ్ వీడియో.. ఇండియాలోనే ఇటలీని చూపించేశారుగా!!

Radhe Shyam Making Video: రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే కలిసి నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సిమిమా.. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథతో తెరకెక్కింది. రాధేశ్యామ్ కోసం పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ డైహార్ట్‌ ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా చివరకు ఈ నెల 11న విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. 

తాజాగా 'రాధేశ్యామ్' టీమ్ ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఇటలీలో 1970ల నాటి నేపథ్యంలో కొనసాగే కథతో రూపొందుతున్న ఈ  సినిమా ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ. కరోనా వ్యాప్తికి ముందు సినిమా షూటింగ్ ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగినట్టు వీడియోలో వెల్లడించారు. యూరప్‌లోని అందమైన లొకేషన్స్‌, మంచు ప్రాంతాలతో సినిమా షూటింగ్‌ జరిపారు. షూటింగ్ కోసం చాపర్లను కూడా ఉపయోగించారు.

కరోనా కారణంగా యూరప్‌లో షూటింగ్‌ ఆగిపోవడంతో.. ఇండియాలో యూరప్‌ సెట్‌ వేసి మరీ షూటింగ్‌ చేశారు. షూటింగ్ కోసం భారీ సెట్‌లను ఏర్పాటు చేశారు. సెట్‌లను చూస్తూనే ఎంతగా ఖర్చు పెట్టారో తెలుస్తుంది. ఆ సెట్‌లనే రాధేశ్యామ్ సినిమాలో కీలకమైన షిప్ ఎపిసోడ్ చిత్రీకరించారు. అంతేకాదు ఫైటింగ్, పాటలను కూడా తీశారు. జస్టిన్ ప్రభాకరన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సంగీతకారులతో ట్యూన్‌లను ఇక్కడే కంపోజ్ చేశారు. మొత్తానికి రాధేశ్యామ్ మేకింగ్‌ వీడియో అందరిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. 

Also Read: Nimmala Rama Naidu: సైకిల్‌ యాత్ర చేస్తూ.. ప్రమాదవశాత్తు జారిపడిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల!!

Also Read: Cockfight in Telangana: తెలంగాణలోనూ రహస్యంగా కోడి పందాలు.. 28 మంది అరెస్ట్.. ఎక్కడంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News