Prithviraj Sukumaran: 'ది గోట్ లైఫ్'- 'ఆడు జీవితం' సినిమా కోసం 31 కిలోల బరువు తగ్గాను..హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Prithviraj Sukumaran: మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్.. స్టార్ హీరోగా, దర్శకుడిగా.. నిర్మాతగా సత్తా చూపెడుతున్నాడు. అంతేకాదు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే వేరే హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. తాజాగా ఈయన 'ది గోట్ లైఫ్.. ఆడు జీవితం' సినిమాతో పలకరించబోతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

Last Updated : Mar 26, 2024, 07:21 PM IST
Prithviraj Sukumaran: 'ది గోట్ లైఫ్'- 'ఆడు జీవితం' సినిమా కోసం 31 కిలోల బరువు తగ్గాను..హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Prithviraj Sukumaran: మల్లూవుడ్  స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా  మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో  థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ గా ఉంది.  ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ తెరకెక్కించారు.   విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. ఈ సినిమాతో 16 ఏళ్లు సుదీర్ఘ ప్రయాణం చేశారు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ సినిమా కోసం ఎంతో  కష్టపడ్డారు. అంతకు మించి శ్రమించారు. "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ఈ సినిమాలో పనిచేసిన అనుభవాలను, తన కెరీర్ విశేషాలను లేటెస్ట్ ఇంటర్వ్యూలో ప్రేక్షకులతో పంచుకున్నారు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.

 "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాను నిజ జీవిత ఘటనల ఆధరాంగా తెరకెక్కించారు దర్శకుడు బ్లెస్సీ. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథ ఈ సినిమాకు ఆధారం. రచయిత బెన్యామిన్ నజీబ్ జీవితానికి అక్షర రూపమిచ్చారు. నజీబ్ ఎడారిలో సాగించిన ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ గోట్ డేస్ అనే పుస్తకాన్ని బెన్యామిన్ రాశారు. కేరళలో పాఠక  ఆదరణ పొందిన ఈ పుస్తకం రైట్స్ కోసం మలయాళం సినీ పరిశ్రమలో ప్రతి స్టార్ హీరో, దర్శక నిర్మాతలు పోటీ పడ్డారు. ఆ హక్కులను మా డైరెక్టర్ బ్లెస్సీ దక్కించుకున్నారు. అప్పుడు ఈ ప్రాజెక్ట్ తో 2008లో బ్లెస్సీ నన్ను సంప్రదించారు. అలా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) తో నా ప్రయాణం మొదలైంది.

- 2018లో "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాము. ముందుగా రాజస్థాన్ ఎడారిలో షూటింగ్ చేయాలని అనుకున్నాము. అక్కడ అరబ్ దేశాల ఎడారుల వాతావరణం ఎక్కడా కనిపించలేదు. దాంతో జోర్డాన్ వెళ్లి షూటింగ్ చేసాము. నేను బరువు తగ్గేందుకు ఒక షెడ్యూల్ షూటింగ్ తర్వాత 7 నెలల గ్యాప్ తీసుకున్నాను. షూటింగ్ ప్రాసెస్ లో ఉండగానే లాక్ డౌన్ వచ్చింది. అప్పుడు జోర్డాన్ షూటింగ్ లో ఉన్నాము. ప్రయాణాలు మొత్తం ఆపేశారు. అక్కడి నుంచి బయటపడే వీలు లేదు. వందేభారత్ ఫ్లైట్‌ తో కేరళ చేరుకున్నాం. ఏడాదిన్నర తర్వాత అల్జీరియా సహారా ఎడారిలో చిత్రీకరణ తిరిగి మొదలే పెట్టాము. ఇలా ఎన్నో కష్టాలు పడి, అరుదైన లొకేషన్స్ లో 'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం) సినిమా షూటింగ్ పూర్తి చేశాము. పోస్ట్ ప్రొడక్షన్ లోనూ రాజీ లేకుండా వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ఈ సినిమా కోసం వర్క్ చేశాం. వాస్తవంగా రెండేళ్లలో పూర్తి చేయాల్సిన సినిమా ఇది. కరోనా వల్ల ఆలస్యమైంది.

- ఈ సినిమా ఒప్పుకున్నప్పుడే షూటింగ్ కోసం ఎంతో కష్టపడాల్సి వస్తుందని తెలుసు. కొన్ని రోజుల పాటు డైట్ చేశాను. నజీబ్ పాత్రలా మారేందుకు ప్రయత్నించాను. ఎందుకంటే నా క్యారెక్టర్ శరీరాకృతి ద్వారా ప్రేక్షకులు ఆ కథను, క్యారెక్టర్ ను అనుభూతి చెందుతారు. క్యారెక్టర్ కోసం నేను కఠినమైన ఆహార నియమాలు పాటించాను. 31 కిలోల బరువు తగ్గాను. ఈ క్రమంలో నా హెల్త్ గురించి మా ఫ్యామిలీ మెంబర్స్ ఆందోళన చెందారు. నా భార్య, మా పాప సినిమా కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని అర్థం చేసుకుని సపోర్ట్ గా నిలిచారు. నజీబ్ ఎడారిలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొని ఉంటాడని ఊహించుకుంటూ ఈ క్యారెక్టర్ లో నటించాను.  కష్టపడినా నజీబ్ క్యారెక్టర్ ను విజయవంతంగా పోషించినందుకు ఆనందంగా ఉంది.

- "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా కోసం మేము చేసిన సుదీర్ఘ ప్రయాణంలో మమ్మల్ని నడిపించిన విషయం మేమొక గొప్ప సినిమా చేస్తున్నామనే నమ్మకమే.  ప్రేక్షకులకు ఒక స్పెషల్ మూవీ ఇవ్వబోతున్నామనే విశ్వాసంతోనే 16 ఏళ్లు సినిమాతో ప్రయాణం చేసాము.  నజీబ్ అనే వ్యక్తి ఇప్పటికీ మన మధ్యే ఉన్నాడు. అతను తన జీవితం ద్వారా మనకు అందించిన స్ఫూర్తి ఎంతో గొప్పది.

- ఈ సినిమా కోసం ఎంతో టైమ్ తీసుకోవాల్సి వచ్చింది. ఏ నటుడు కూడా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ చేయలేడు. కొన్ని వదిలేయాల్సి వస్తుంటుంది. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు వచ్చిన కొన్ని సినిమాల్లో నటించలేకపోయాను. ఇలాంటి అరుదైన సినిమాకు పనిచేస్తున్నప్పుడు మిగతా ఆఫర్స్ వదులుకోవడం తప్పదు.

- "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా కోసం తీవ్రమైన చలిలో, వేడి వాతావారణంలో, బలమైన గాలులు వీచే వాతావరణంలో షూటింగ్ చేశాం. ఏడారి జీవితాన్ని సజీవంగా తెరపై చూపించాలంటే అక్కడి వాతావరణాన్ని క్యాప్చర్ చేయాలి. ఇందుకోసం మా మూవీ టీమ్ ఎంతో కష్టపడి పనిచేసింది.

- డైరెక్టర్ బ్లెస్సీ నేను "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా విడుదల కాబోతున్న రోజు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాము. ఇది మా కల. అది నిజమవుతుందంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా రూపకల్పనలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి, ఎన్నో కష్టాలు పడ్డాము. ఇప్పుడు అవన్నీ దాటుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము. ఇంత కష్టపడిన సినిమా ప్రేక్షకుల దగ్గరకు చేరాలి. ఇందుకు పేరున్న దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ను సెలెక్ట్ చేసుకున్నాము.

- తెలుగులో మా సినిమాను మైత్రీ మూవీ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం సంతోషంగా ఉంది. మైత్రీ రవి గారికి ఫోన్ చేసి ఈ సినిమా నా కెరీర్ కు ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పాను. ఆయన రిలీజ్ చేద్దామని మాటిచ్చారు. మైత్రీ సంస్థ ద్వారా మా సినిమా ప్రేక్షకులకు దగ్గరవుతుందని నమ్మకం ఉంది. "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా తెలుగు వెర్షన్ కోసం మేము చాలా శ్రద్ధ తీసుకున్నాం. తెలుగు పాటల విషయంలో, డైలాగ్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. మిగతా భాషల్లో డబ్బింగ్ చెప్పినట్లే తెలుగులోనూ నేనే డబ్బింగ్ చెప్పాను.

- లాస్ట్ ఇయర్ సలార్ లో నన్ను ప్రేక్షకులు రాజమన్నార్ గా ఆదరించారు. ఇప్పుడు "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాలో సలార్ కు పూర్తి భిన్నమైన పాత్ర చేశాను. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ఆశిస్తున్నాను. సర్వైవల్ థ్రిల్లర్స్ ప్రేక్షకులకు తప్పకుండా ఆసక్తి కలిగిస్తాయి. నజీబ్ క్యారెక్టర్ లో నా నటన ఎలా ఉందో ప్రేక్షకుల స్పందనతో తెలుసుకోవాలని అనుకుంటున్నాను.

- నా కెరీర్ విషయానికి వస్తే అనుకోకుండానే నటుడిని అయ్యాను. మనం సినిమాలను కమర్షియల్, కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ అంటూ విభజన చేస్తాం. కానీ నా దృష్టిలో మంచి సినిమాకు మంచి స్క్రిప్ట్ ఉండాలి. కమర్షియల్ మూవీస్ లోనూ బలమైన కథా కథనాలు ఉంటాయి. మంచి నటులు తమకొచ్చే అరుదైన అవకాశాలు వదులుకోరని భావిస్తాను.

Also Read:  Love Guru Trailer: 'లవ్‌గురు'తో వస్తున్న బిచ్చగాడు హీరో.. ట్రైలర్‌ చూస్తే నవ్వులే

Also Read:  Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News