Thaman About Nandamuri Balakrishna తమన్ తాను పని చేస్తున్న ప్రతీ హీరోను ఆకాశానికెత్తేస్తున్నాడు. ప్రతీ హీరోకి ఫ్యాన్ చెబుతూనే ఉన్నాడు. ఇక ఇది ఒక దశ దాటాక భజనలా అందరికీ అనిపిస్తోంది. ప్రతీ హీరోని స్టేజ్ మీద పొగుడుతూ ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. మొన్నటి వరకు వారిసు సినిమా ఫీవర్‌లో ఉన్నాడు తమన్. వారిసు, విజయ్ గురించి చెప్పిన తమన్ మాటలు సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ప్రాణం పెట్టి చేశానని, చివరికి ప్రాణం పోయినా పర్లేదంటూ తమన్ చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక విజయ్‌కు బిగ్ ఫ్యాన్ అని తమన్ చెప్పుకుంటాడు. ఇక్కడకు వచ్చే సరికి బాలయ్య, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇలా అందరికీ ఫ్యాన్ అని చెబుతుంటాడు. అఖండ సినిమా సమయంలో బాలయ్యను ఆకాశానికెత్తేశాడు. గాడ్ ఫాదర్ టైంలో చిరంజీవిని, వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలకు పని చేసిన సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాని చెప్పాడు. ఇవన్నీ ఇప్పుడు జనాలు పైకి తీసి మరీ ట్రోల్ చేస్తున్నారు.
ఇక ఇవన్నీ ఇలా ఉంటే నిన్న జరిగిన ఈవెంట్లో తమన్ చెప్పిన మాటలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అఖండ సినిమాకు ఆర్ఆర్ కొట్టే సమయంలో కనీసం ఆమ్లెట్ కూడా తినేవాడు కాదట. ప్రస్తుతం ఈ మాటల మీద జనాలు ట్రోలింగ్ చేస్తున్నారు. నా లైఫ్‌కి బాలయ్య బాబు శివుడు, అఖండకి బ్యాక్ గ్రౌండ్ చేసేటప్పుడు ఆమ్లెట్ కూడా తినకుండా లింగ పూజ చేస్తూ ఆర్ఆర్ కొట్టాను అంటూ తమన్ చెప్పాడు.
దీంతో జనాలు తమన్ మీద సెటైర్లు వేస్తున్నాడు. మళ్లీ మొదలెట్టేశాడు భజనం, అది కాస్త అతి అనిపించడం లేదా? అప్పుడు అమ్మ బిర్యానీ, ఇప్పుడు ఈ ఆమ్లెటా? అని జనాలు తమన్‌ను ఆడేసుకుంటున్నారు. తమన్ ప్రస్తుతం సౌత్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతోన్నాడు. శంకర్ రామ్ చరణ్ ప్రాజెక్టికి సైతం తమన్ మ్యూజిక్ కొట్టేస్తున్నాడు. సౌత్‌లో పూర్తిగా అనిరుధ్, తమన్ డామినేషనే కనిపిస్తుంటుంది.
Also Read: Disha Patani Pics : చెక్కిన శిల్పంలా ఉంది!.. ఒంపుసొంపులు కనిపించేలా దిశా పటానీ అందాల ప్రదర్శన
Also Read: Deva Katta : ఆ స్క్రిప్ట్ నాదే.. బీర్ బాటిల్స్ నావి కాదు.. దేవా కట్టా పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి