Thalapathy Vijay: తమిళ నటుడు, డీఎండీకే (దేశీయ ముర్పోక్కు ద్రావిడ కజగం) అధినేత కెప్టెన్ విజయకాంత్ (Vijayakanth) నిన్న ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆరోగ్య సమస్యలతో కొద్దిరోజులుగా బాధపడుతున్న విజయ్ కాంత్.. శ్వాస సంబంధిత సమస్యతో చెన్నైలోని మియోట్ దవాఖానలో చేరగా.. కొవిడ్ నిర్ధారణ అయింది. తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్న ఆయన్ని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తుండగా.. విజయకాంత్ తుదిశ్వాస విడిచారు. కాగా ఈరోజు ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరిగాయి. అంత్యక్రియలకు హాజరైన తమిళ హీరో విజయ్ కి తీవ్ర అవమానం జరగడం అందరిని ఆశ్చర్యపరిస్తోంది.
కోయంబేడులోని డిఎండికె పార్టీ కార్యాలయంలో ఉంచిన విజయ్ కాంత్ మృతదేహాన్ని సందర్శించేందుకు దళపతి విజయ్ వచ్చాడు. విజయ్ కాంత్ ని బాగా అభిమానించే విజయ్ అక్కడ విజయ్ కాంత్ ని చూడగానే.. తనను తాను నియంత్రించుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. తమిళంలో సూపర్ స్టార్ గా పేరుగాంచిన విజయ్ నటించిన మొట్టమొదటి సినిమా వెట్రి. కాగా ఆ చిత్రంలో హీరో విజయ్ కాంత్. అప్పటినుంచీ ఈ ఇద్దరి మధ్య అనుబంధం కొనసాగుతోంది. అంతేకాకుండా ఈ సినిమాకు విజయ్ తండ్రి ఎస్ఎ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు.
ఈ నేపథ్యంలో విజయ్ కాంత్ అంత్యక్రియలకు హాజరయ్యారు విజయ్. కాగా అంత్యక్రియలకు హాజరైన విజయ్ ఆ తర్వాత తన కారు ఎక్కుతూ ఉండగా అక్కడ చాలామంది జనం విజయ్ ని చుట్టుముత్తారు. ఆ జనం నుంచి ఒక వ్యక్తి విజయ్ పైకి తన చెప్పు విసిరేశారు. ఆ చెప్పు వచ్చి విజయ్ వెనక భాగం పైన తగిలింది. వెంటనే సెక్యూరిటీ విజయ్ ని అక్కడి నుంచి తరలించడం మొదలుపెట్టారు.
This is unwanted things at funeral. pic.twitter.com/DQANBcToSB
— T J V🃏 (@TrollJokarVijay) December 28, 2023
ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన అజిత్ అభిమానులు సైతం విజయ్ పై ఇలా జరిగిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి విజయ్ పైన చెప్పు వేసిన ఆ వ్యక్తి ఎవరు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఎవరో విజయ్ అంటే పడని వేరే హీరో అభిమాని ఇలాంటి పని చేసి ఉంటారని.. కానీ ఇలా చేయడం చాలా తప్పని వేరే హీరోల అభిమానులు సైతం సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter