Nagma: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అలనాటి స్టార్ హీరోయిన్.. ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Tollywood Senior Actress: 90 దశకంలో కుర్రకారుని ఒక ఊపు ఊపేసిన డ్రీమ్ గర్ల్ నగ్మా. హీరో కంటే ముందు నగ్మా కాల్ షీట్స్ కోసం డైరెక్టర్స్ క్యూ కట్టేవారు. మరి అలాంటి బ్యూటీ క్వీన్ ఇప్పుడు గుర్తుపట్టలేనట్టుగా మారిపోయింది. అసలు నగ్మా ఎక్కడ ఉంది? ఏం చేస్తోందో తెలుసా?

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2024, 07:00 AM IST
Nagma: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అలనాటి స్టార్ హీరోయిన్.. ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Herione Nagma: 1990 లో సల్మాన్ ఖాన్ సరసన ‘బాగీ’మూవీ తో సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది నగ్మా. ఆ తర్వాత 1991లో నాగార్జున కిల్లర్ చిత్రంతో  తెలుగు ఇండస్ట్రీలో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది. తెలుగు, హిందీ, తమిళ్ , కన్నడ సినిమాలతో పాటు భోజపురి చిత్రాల్లో కూడా నగ్మా నటించింది. అయితే 2008 తర్వాత ఆమె చాలా వరకు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. చివరిగా నగ్మా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ అల్లరి రాముడు చిత్రంలో ఆర్తి అగర్వాల్ కి తల్లిగా కనిపించింది. ఆ తరువాత చాలా సంవత్సరాలు ఈ నటి కనుమరుగైపోయింది.

ఈ నేపథ్యంలో తాజాగా  నగ్మాకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ..తిరిగి మళ్ళీ ఆమె ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అన్న విషయాలపై చర్చలు మొదలయ్యాయి.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varinder Chawla (@varindertchawla)

90వ దశకంలో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నగ్మా. చిరంజీవి, మోహన్ బాబు,నాగార్జున.. ఇలా టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన సినిమాలు చేసింది. ప్రభుదేవాతో ఆమె తమిళ్ లో నటించిన ‘కాదలన్’.. తెలుగులో ప్రేమికుడు చిత్రం.. యూత్ లో ఆమెకు మంచి క్రేజ్ తెచ్చింది. రాజకీయాల పట్ల ఆసక్తి కలగడంతో 2014లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది.సినిమాలో ఉన్న  క్రేజ్ తనను ఎలక్షన్స్ లో గెలిపిస్తుంది అని ఆశించిన నగ్మా ఓటమిని చవిచూసింది. ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ లో కొనసాగిన నగ్మా 2015లో ‘ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్’ ప్రధాన కార్యదర్శి గా వ్యవహరించింది.

గత కొద్ది కాలంగా నగ్మా సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా లేదు. అయితే ఇటీవల ఆమెకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు గుర్తుపట్టలేనట్టుగా మారిపోయిన నగ్మాను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు ఎంతో నాజూకుగా ఉందే నగ్మా ఈ వీడియోలో బాగా బొద్దుగా కనిపించింది. దీంతో ఇప్పుడు వీడియోలో చూస్తున్న నగ్మా ఒకప్పుడు సినిమాల్లో కనిపించిన నగ్మా ఒకరేనా? అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు నెటిజన్లు. 48 సంవత్సరాల వయసున్న నగ్మా సుమారు 20 సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. మరోపక్క ఆమె చెల్లెలు జ్యోతిక మాత్రం ఇప్పటికి కూడా వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ప్రస్తుతం ముంబైలో నగ్మా ఒంటరిగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే

Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News