Minister KTR about Pawan Kalyan: ఆ సినిమా నుంచే నేను పవన్‌కి ఫ్యాన్.. పవన్ గొప్పతనం గురించి మంత్రి కేటీఆర్

Minister KTR about Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందించే విషయమిది. పవన్ అంటే తనకెందుకు ఇష్టమో..ఎప్పటి నుంచి ఇష్టమో తెలంగాణ డైనమిక్ మినిస్టర్ కేటీఆర్ వివరించారు. ఆ కారణమేంటో మనమూ చూద్దాం

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 24, 2022, 01:52 PM IST
  • భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ వేడుకలో తెలంగాణ మంత్రి కేటీఆర్
  • పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు కురిపించిన మంత్రి కేటీఆర్
  • తొలిప్రేమ సినిమా చూసినప్పటి నుంచి ఆయనకు ఫ్యాన్‌గా మారానంటున్న కేటీఆర్
Minister KTR about Pawan Kalyan: ఆ సినిమా నుంచే నేను పవన్‌కి ఫ్యాన్.. పవన్ గొప్పతనం గురించి మంత్రి కేటీఆర్

Minister KTR about Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందించే విషయమిది. పవన్ అంటే తనకెందుకు ఇష్టమో..ఎప్పటి నుంచి ఇష్టమో తెలంగాణ డైనమిక్ మినిస్టర్ కేటీఆర్ వివరించారు. ఆ కారణమేంటో మనమూ చూద్దాం

టాలీవుడ్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకడు పవన్ కళ్యాణ్. తెలంగాణ డైనమిక్ మినిస్టర్ కేటీఆర్ కూడా పవన్ కళ్యాణ్‌కు అభిమానే. అందుకే భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు  అతిధిగా హాజరవడమే కాకుండా పవన్‌పై ప్రశంసలు కురిపించారు. అసలు పవన్ కళ్యాణ్‌కు తానెందుకు అభిమానిగా మారానో వివరించారు. పవన్‌కు అభిమానిగా అంకురార్పణ ఇప్పటిది కాదని..24 ఏళ్ల క్రితమే పడిందన్నారు. 

పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఇటీవల అంటే అత్తారింటికి దారేది కాగా, తొలినాళ్లలో అయితే తొలి ప్రేమ. తొలిప్రేమ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పవచ్చు. అభిమానుల్ని అంతగా ఆకట్టుకున్న సినిమా అది. యూత్ లవ్ స్టోరీ నేపధ్యంలో సాగే సినిమా కావడంతో సహజంగానే యూత్‌లో క్రేజీగా మారింది. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఆకర్షించింది కూడా ఇదే సినిమా అటు. 24 ఏళ్ల క్రితమే పవన్ కళ్యాణ్‌కు కేటీఆర్ అభిమానిగా మారారట. తొలిప్రేమ సినిమా చూసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌కు అభిమానిగా మారానని అంటున్నారు కేటీఆర్. భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

వెండితెరపై పవన్ కళ్యాణ్‌కు ఉన్నంత ఆరాధించే అభిమానులు ఏ హీరోకూ లేవంటున్నారు కేటీఆర్. పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు కురిపించారు కేటీఆర్. పవన్ కళ్యాణ్ అంతటి ఓపెన్ హార్టెడ్ వ్యక్తి అన్నారు. ఫిల్మ్‌స్టార్ కంటే చాలా ఎక్కువని కీర్తించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున తాను హాజరు కాలేదని..పవన్ కళ్యాణ్ సోదరుడిగా ఈ వేడుకకు హాజరయ్యానన్నారు కేటీఆర్. కేవలం తెలుగు సినిమాకే కాకుండా మొత్తం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కావల్సిన సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. భీమ్లానాయక్ సినిమా బృందం ప్రయత్నాల్ని కేటీఆర్ అభినందించారు. మొగలయ్య వంటి జానపద కళాకారుల్ని తెలుగు సినిమాకు పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

Also read: Bheemla Nayak Latest Updates: షూటింగ్‌లో గాడ్ ఫాదర్, భీమ్లా నాయక్ మీటింగ్.. ఇంట్రెస్టింగ్ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News