TS High Court Cancels Vyooham Movie Censor Certificate: కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు మరోసారి షాక్ తగిలింది. ఈ మూవీ విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసింది. కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ను జనవరి 11వ తేదీ వరకు సస్పెండ్ చేసింది. వ్యూహం చిత్రంలో అభ్యంతర సన్నివేశాలు ఉన్నాయని తెలిపిన హైకోర్టు.. సినిమా విడుదలను ఆపేయాలని రామదూత క్రియేషన్స్, ప్రొడ్యూసర్ దాసరి కిరణ్‌కుమార్‌లకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 11వ తేదీకి పిటిషన్‌ను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యూహం సినిమా తెరకెక్కించారని.. ఈ మూవీ ప్రదర్శనకు కేంద్ర సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వ్యూహం మూవీ శుక్రవారం (డిసెంబర్ 29) విడుదల కావాల్సి ఉండగా.. గురువారం విచారణ చేపట్టింది హైకోర్టు. ఉదయం 11.45 నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘ వాదనలను విన్న జస్టిస్ సూరేపల్లి నంద.. గురువారం రాత్రి 11.30 గంటల తరువాత వ్యూహం మూవీపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సినిమా ప్రదర్శనకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్‌ను జనవరి 11వ తేదీ వరకు సస్పెండ్ చేసింది. అంతకుముందు పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్‌రావు, ఉన్నం శ్రవణ్‌కుమార్‌లు వాదనలు వినిపించారు.
భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కక్ష సాధింపుగా సినిమాలను తీసి.. రిలీజ్ చేయడం సరికాదని వాదించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి ప్రతిష్ఠను దెబ్బతీయాలని ప్రొడ్యూసర్, డైరెక్టర్ బహిరంగంగా ప్రయత్నిస్తున్నారని కోర్టుకు తెలిపారు. గతంలో ఇలానే అయిదారు సినిమాలు తీశారని.. వాటితో ఎలాంటి లాభం రాకపోయినా మళ్లీ తీస్తున్నారని చెప్పారు. ఈ సినిమాలకు ఓ నాయకుడి నుంచి ఆర్థిక సాయం అందుతోందని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డిని గొప్పగా చూపిస్తూ.. చంద్రబాబు ప్రతిష్ట దెబ్బ తీయడమే లక్ష్యంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారని అన్నారు. వ్యూహం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు మంత్రులు హాజరయ్యారని చెప్పారు. వ్యక్తి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేలా రూపొందించిన వ్యూహం సినిమా విడుదలను ఆపేయాలని కోర్టును కోరారు.
నిర్మాతల తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. కేవలం వ్యూహం మూవీ ట్రైలర్ చూసి కోర్టును ఆశ్రయించి.. విడుదలను ఆపేయాలని కోరడం సరికాదన్నారు. ఒకసారి బోర్డు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసిన తరువాత కోర్టులు జోక్యం చేసుకోరాదని సెన్సార్ బోర్డు తరఫున అదనపు ఏజీ పి.నరసింహశర్మ వాదించారు. ప్రాంతీయ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించిందని.. ఛైర్మన్ ద్వారా రివిజనల్ కమిటీకి సిఫారసు చేసినట్లు కోర్టుకు తెలిపారు. 10 మందితో కూడిన కేంద్ర సెన్సార్ కమిటీ సినిమాను పరిశీలించి.. కొన్ని అంశాలను తొలగించాలని సూచించిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. జనవరి 11వ తేదీ వరకు సర్టిఫికెట్‌ను సస్పెండ్ చేసింది.
Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter