Ghani Latest Updates: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గని' టీమ్‌కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. 'గని' సినిమాకు పాత టికెట్ ధరలే వర్తిస్తాయని... టికెట్ ధరల పెంపు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాత టికెట్ రేట్ల ప్రకారం... మల్టీప్లెక్స్‌లో టికెట్ ధర రూ. రూ. 200 నుంచి రూ.250 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో గరిష్టంగా రూ.150 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
'గని' మేకర్స్ టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వాన్ని సంప్రదించనట్లు తెలుస్తోంది. గని భారీ బడ్జెట్ చిత్రం కూడా కాదు కాబట్టి టికెట్ ధరల పెంపు అవసరం లేదని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గని సినిమాకు పాత టికెట్ రేట్లే వర్తిస్తాయని ప్రకటన విడుదల చేసింది. ఇటీవలి కాలంలో వరుసగా 'రాధేశ్యామ్, 'ఆర్ఆర్ఆర్' సినిమాలకు భారీగా టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఇలా అయితే సామాన్యుడి జేబుకే చిల్లు ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా 'గని' సినిమాకు టికెట్ ధరల పెంపు లేదని ప్రకటించడంతో సామాన్య ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, గని సినిమా విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లోనే విడుదల కావాల్సిన ఉన్న ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరుణ్ తేజ్ తల్లి పాత్రలో నదియా నటిస్తుండగా.. జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు.
Also Read: Actress Kushitha: పబ్ ఓపెన్ ఉంది కాబట్టే చిల్ అవడానికి వెళ్లాం... దయచేసి దుష్ప్రచారం వద్దు..
Also Read: Prabhas Maruti Movie: హారర్ నేపథ్యంలో ప్రభాస్, మారుతి చిత్రం.. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook