Taraka Ratna: మరణం కూడా దూరం చెరపలేకపోయిందా...కన్న కొడుకును కడసారి చూడలేదా

Taraka Ratna: నందమూరి తారకరత్న అంత్యక్రియలు ఇవాళ జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో జరగనున్నాయి. తారకరత్న మరణవార్త విని ప్రముఖులంతా తరలివచ్చి నివాళులు అర్పిస్తున్నారు. కానీ కన్న తల్లిదండ్రులు మాత్రం హాజరుకాలేదనే వార్త వైరల్ అవుతోంది. ఇదే ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎంతవరకూ నిజమో తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 20, 2023, 09:15 AM IST
Taraka Ratna: మరణం కూడా దూరం చెరపలేకపోయిందా...కన్న కొడుకును కడసారి చూడలేదా

నందమూరి తారకరత్న మరణవార్త ఇద్దరిని తప్ప అందర్నీ కలచివేసిందనే చెప్పాల్సి వస్తుంది. మరోవైపు తారకరత్న మరణవార్త కూడా తల్లిదండ్రులకు, కొడుకుకు మధ్య పెరిగిన దూరాన్ని కొడుకు  చెరపలేకపోయిందనే వార్త నిన్న అర్ధరాత్రి నుంచి గుప్పుమంటోంది. కన్న తల్రిదండ్రులు కొడుకును చూసేందుకు ఇంకా రాలేదని సోషల్ మీడియాలో అదే పనిగా ప్రచారం సాగుతోంది. 

నందమూరి తారకరత్న. ప్రత్యర్ధుల్నించి సైతం మంచి మనిషిగా కీర్తింపబడుతున్న వ్యక్తి. 23 రోజులు మృత్యువుతో పోరాడి..చివరి అలసిపోయి తుది శ్వాస విడిచాడు. మృత్యువుతో తారకరత్న పోరాటం వేలాదిమందిని కదిలించేసింది. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చి నివాళులు అర్పిస్తున్నారు. తల్లిదండ్రుల్లో మాత్రం కనీసం స్పందన లేదని.. ప్రముఖులంతా తల్లడిల్లిపోతున్నా..కన్న తల్లిదండ్రుల్లో చలనం లేదని పలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. తారకరత్న మరణించి 36 గంటలౌతున్నా..కొడుకు మృతదేహాన్ని చూసేందుకు హైదరాబాద్‌లోని తారకరత్న నివాసానికి రాలేదనే వార్తలు, వాటిపై కామెంట్లు ఊపందుకున్నాయి. ఇవాళ నేరుగా మహా ప్రస్థానంలో అంత్యక్రియలకు హాజరౌతారనే ప్రచారం కూడా జరుగుతోంది.  

ఎందుకీ దూరం

వాస్తవానికి నందమూరి తారకరత్న కులాంతర వివాహం చేసుకున్నప్పటి నుంచి తల్లిదండ్రులు అతనితో దూరంగా ఉన్నారు. రెండు కుటుంబాలకు దాదాపు మాటల్లేవు. దీనిని అంటే ఇరువురికి మధ్య ఉన్న దూరాన్ని దృష్టిలో ఉంచుకుని..కొడుకును చూసేందుకు తల్లిదండ్రులు రాలేదనే ప్రచారం జరుగుతోంది. కన్న కొడుకు మరణం కూడా తల్లిదండ్రుల్ని కదల్చలేకపోయిందననే కామెంట్లు ఎక్కువౌతున్నాయి. కొడుకుతో, కోడలితో ఇంకా దూరం కొనసాగిస్తున్నారని..ఎంతైనా కొడుకు కొడుకే కదా అనే విమర్శలు అతని తల్లిదండ్రులపై విన్పిస్తున్నాయి. కన్న కొడుకును కడసారి చూడకుండా ఇంతసేపు ఎలా ఉండగలిగారనే ప్రశ్నలు వస్తున్నాయి. 

అదే సమయంలో చంద్రబాబు, లోకేశ్వరి, వసుంధర సహా ఇతర కుటుంబసభ్యులు నందమూరి తారకరత్న తండ్రి మోహనకృష్ణను ఇంటికెళ్లి పరామర్శించిన వీడియో వైరల్ అవుతోంది. కన్న కొడుకు చనిపోయినా ఇంకా వివక్ష పాటిస్తూ..చూసేందుకు వెళ్లకపోవడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువైంది. ఇవాళ నేరుగా మహా ప్రస్థానంలో జరిగే అంత్యక్రియలకు మాత్రం హాజరుకావచ్చని తెలుస్తోంది. 

వాస్తవం ఏంటి

ఈ అంశంపై జీ న్యూస్ ఫ్యాక్ట్ చెక్ చేసింది. వాస్తవానికి ఆంబులెన్స్‌లో నందమూరి తారకరత్న మృతదేహాన్ని తీసుకొచ్చేటప్పటికే తండ్రి నందమూరి మోహనకృష్ణ అక్కడే ఉన్నారు. కొడుకు దూరమయ్యాడనే బాధ, అనారోగ్యం కారణంగా స్టిక్ సహాయంతో నిలుచుని ఉన్నారు. ఆ తరువాత కాస్సేపటికి లోపల ఇంట్లోకి తీసుకెళ్లిపోయారు. అంటే సోషల్ మీడియా, పలు వెబ్‌సైట్లలో జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని తేలింది. కొడుకు మృతదేహాన్ని చూసేందుకు తారకరత్న రాలేదని జరుగుతున్న ప్రచారంలో  ఏమాత్రం నిజం లేదు. 

Also read: Taraka Ratna Death Live Updates: బాలయ్యను చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగలించుకొని ఏడ్చిన తారక రత్న కుమార్తె

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News