Koratala siva-Jr Ntr: కొరటాల శివ సినిమాలో సూపర్ స్లిమ్‌గా కన్పించనున్న తారక్

Koratala siva-Jr Ntr: కొరటాల శివ అంటేనే ఓ హిట్. విభిన్న కథాంశాలుంటాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో మరో విభిన్న కధాంశంతో సిద్ధమౌతున్నాడు. అటు తారక్ కూడా చాలా స్టైలిష్ లుక్ ఇవ్వనున్నాడట..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 24, 2022, 02:46 PM IST
  • ఆచార్య తరువాత జూనియర్ ఎన్టీఆర్‌తో బిజీ కానున్న కొరటాల శివ
  • వైవిద్యమైన కథాంశం, భిన్నమైన కథతో రానున్న కొరటాల శివ
  • పూర్తిగా సూపర్ స్లిమ్ లుక్‌లో కన్పించబోతున్న జూనియర్ ఎన్టీఆర్
 Koratala siva-Jr Ntr: కొరటాల శివ సినిమాలో సూపర్ స్లిమ్‌గా కన్పించనున్న తారక్

Koratala siva-Jr Ntr: కొరటాల శివ అంటేనే ఓ హిట్. విభిన్న కథాంశాలుంటాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో మరో విభిన్న కధాంశంతో సిద్ధమౌతున్నాడు. అటు తారక్ కూడా చాలా స్టైలిష్ లుక్ ఇవ్వనున్నాడట..

టాలీవుడ్‌లో మిర్చి సినిమా నుంచి మర్చిపోలేని సినిమాలు అందిస్తున్న మెగా దర్శకుడు కొరటాల శివ..మెగాస్టార్, రామ్‌చరణ్‌లతో ఆచార్య సినిమా తెరకెక్కించాడు. ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఆచార్య సినిమాపై చాలా అంచనాలున్నాయి. అందరికీ తెలిసిన కధనే..వైవిద్యంగా చెబుతుంటాడు. ఒక్కోసారి విభిన్న కథాంశంతో అందర్నీ మెప్పిస్తుంటాడు కొరటాల శివ. అదే అతడి ప్రత్యేకత. భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ సినిమాలతో మెగా హిట్ దర్శకుడయ్యాడు. ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా మెగాస్టార్ చిరంజీవి అందుకే అతడి గురించి అంత గొప్పగా చెప్పాడు.

ఆచార్య తరువాత కూడా కొరటాల శివ బిజీ. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌తో మరో సినిమాకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబో సినిమాపై చర్చ నడుస్తోంది. జనతా గ్యారేజ్ మంచి హిట్ కావడంతో ఇప్పుడు వచ్చే తదుపరి సినిమా కధ ఏమై ఉంటుందనేది ఆసక్తిగా మారింది. వైవిద్యమైన కథల్ని ఎంచుకోవడంలో ముందుండే కొరటాల శివ..ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు కూడా అలాంటిదే కధ ఎంచుకున్నారట.ఇప్పటి వరకూ భారతీయ వెండితెరపై ఎవరూ చూపించని వైవిద్యమైన బ్యాక్‌డ్రాప్ ఉంటుందని కొరటాల శివ అంటున్నాడు. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ లుక్ కూడా పూర్తిగా మారనుంది. పూర్తి స్లిమ్ లుక్‌లో స్టైలిష్‌గా కన్పించనున్నాడు. ఇది జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా కూడా కానుంది. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ జరుగుతుండగానే కొరటాల శివ..జూనియర్ ఎన్టీఆర్‌కు కధ చెప్పి ఒప్పించాడు.

Also read: Ananya Pandey Photos: ట్రెక్కింగ్ ను ఆస్వాదిస్తున్న లైగర్ బ్యూటీ- ఫొటోలు వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News