Tanya Roberts: జేమ్స్ బాండ్ నటి తాన్యా రాబర్ట్స్ బతికే ఉన్నారు..

Tanya Roberts Latest News: జేమ్స్ బాండ్ హీరోయిన్ తాన్యా రాబర్ట్స్ కన్నుమూశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే హాలీవుడ్ నటి తాన్యా రాబర్ట్స్ బతికే ఉన్నారని ఆమె వ్యక్తిగత సిబ్బంది వెల్లడించినట్లు సమాచారం.

Last Updated : Jan 5, 2021, 12:32 PM IST
Tanya Roberts: జేమ్స్ బాండ్ నటి తాన్యా రాబర్ట్స్ బతికే ఉన్నారు..

Tanya Roberts Latest News: జేమ్స్ బాండ్ హీరోయిన్ తాన్యా రాబర్ట్స్ కన్నుమూశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే హాలీవుడ్ నటి తాన్యా రాబర్ట్స్ బతికే ఉన్నారని ఆమె వ్యక్తిగత సిబ్బంది వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వయసు 65 సంవత్సరాలు. బాండ్ గాళ్ తాన్యా రాబర్ట్స్ ఇకలేరంటూ నివాళులు సైతం అర్పించారు. 

ద బీస్ట్ మాస్టర్, షీనా: క్వీన్ ఆఫ్ ద జంగిల్, బాడీ స్లామ్, నైట్ ఐస్ వంటి చిత్రాలతో పాటు జేమ్స్ బాండ్ సినిమాలతో హాలీవుడ్(Hollywood) నటి తాన్యా రాబర్ట్స్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. అయితే డిసెంబరు 24న తన పెంపుడు కుక్కలతో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఆమె అస్వస్థతకు లోనై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దాదాపు రెండు వారాల నుంచి ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. దట్ 70ఎస్ షో స్టార్స్ ప్రతినిధి మైక్ పింగెల్ తెలిపారు.

Gallery: Anchor Manjusha Photos: యాంకర్ ముంజూష లేటెస్ట్ ఫొటోస్

నటి తాన్యా రాబర్ట్స్ బతికున్నారు కానీ, ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదని చెప్పారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారని పింగెల్ వెల్లడించారు. లాస్ ఏంజిల్స్‌లోని సెడార్ సినర్ ఆసుపత్రి వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 

Also Read: Anchor Lasya: సారీ చెప్పిన యాంకర్ రవి.. టామ్ అండ్ జెర్రీ మరోసారి..

మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన తాన్యా రాబర్ట్స్ అనంతరం టీవీ యాడ్స్ చేశారు. 1975లో తొలి సినిమాలో నటించారు. 1985లో వచ్చిన జేమ్స్ బాండ్ మూవీ 'ఏ వ్యూ టు ఏ కిల్'తో గుర్తింపు పొందారు. జేమ్స్ బాండ్ నటిగా ఆమె పేరు సంపాదించుకున్నారు.

Gallery: Rashmi Gautam Photos: యాంకర్ రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫొటోషూట్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News