వైఎస్ జగన్ పాత్రలో తమిళ స్టార్ హీరో ?

యాత్ర సినిమాలో తమిళ స్టార్ హీరో

Last Updated : Jul 25, 2018, 02:16 PM IST
వైఎస్ జగన్ పాత్రలో తమిళ స్టార్ హీరో ?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న యాత్ర సినిమాలో మళయాళం స్టార్ హీరో మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో పంచెకట్టులో మమ్ముట్టి అభివాదం చేస్తున్నట్టుగా ఉన్న ఫస్ట్ లుక్ సైతం రిలీజ్ కాగా వైఎస్ఆర్ అభిమానుల నుంచి ఆ ఫస్ట్ లుక్‌కి భారీ స్పందన సైతం కనిపించింది. ఇక ఈ సినిమాలో వైఎస్ జగన్ తర్వాత మళ్లీ అంతటి ప్రాధాన్యత కలిగిన పాత్ర వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది. తండ్రి మరణానంతరం తండ్రి ఆశయాల సాధన కోసం పార్టీని స్థాపించి, రాష్ట్రంలో మళ్లీ నాడు తన తండ్రి అందించినటువంటి పాలన అందించాలనే లక్ష్యంతో ప్రజల్లోకి దూసుకెళ్తున్న వైఎస్ జగన్ పాత్ర కోసం గతంలో తమిళ స్టార్ హీరో సూర్య పేరును పరిశీలిస్తున్నట్టు ఓ టాక్ వినిపించింది. 

అయితే, తాజాగా అందుతున్న టాలీవుడ్ అప్‌డేట్స్ ప్రకారం జగన్ పాత్రలో సూర్య కాకుండా అతడి సోదరుడు కార్తి పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ పాత్ర కోసం కార్తిని ఆశ్రయించినట్టుగానూ ప్రచారం జరుగుతోంది. తమిళ, తెలుగు భాషల్లో కార్తికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటమే అతడిని ఎంచుకోవడం వెనుక ఓ కారణం. ఒకవేళ కార్తి ఈ ఆఫర్‌కి ఓకే చెబితే, వైఎస్ జగన్ పాత్రలో కార్తిని చూసే అవకాశం ఉంది. మహి వి రాఘవ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా వచ్చే ఎన్నికల ముందు రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Trending News