Vijayakanth Death:
తమిళ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈరోజు ఆయనకి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఒకప్పుడు యాక్షన్ హీరో అంటే తమిళ ప్రేక్షకులకే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా గుర్తొచ్చే పేరు విజయ్ కాంత్. కాగా ఈ హీరో ఆరోగ్య పరిస్థితి చాలా రోజులుగా బాగా లేకపోవడంతో ఈ మధ్య హాస్పిటల్ లో కూడా చేరి చికిత్స పొందుతూ వచ్చారు. ఇక ఈరోజు పరిస్థితి విషమించడంతో ఆయన బంధువులు అలానే పార్టీ సభ్యులు వెంటనే హాస్పిటల్కి చేరుకున్నారు. కాగా వెంటిలేటర్ పై చికిత్స అందిస్తుండగా.. కోలుకోలేక గురువారం ఉదయం విజయ్ కాంత్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
విజయ్ కాంత్ పూర్తి పేరు.. విజయరాజ్ అలగర్‌స్వామి 1952 ఆగస్టు 25లో జన్మించారు. విజయ్ కాంత్ హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి సెన్సేషనల్ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు తమిళ తెలుగు సినిమాల్లో రాణిస్తూనే.. మరోవైపు తమిళనాడు రాజకీయాల్లోను సత్తా చాటారు. తమిళనాడు శాసనసభలో 2011 నుండి 2016 వరకు ప్రతిపక్ష నాయకునిగా భాద్యతలను నిర్వహించారు. ఈయన రెండు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. కాగా ఈయన రాజకీయాల్లోకి రాకముందు సినిమాలలో నటించడమే కాకుండా, నిర్మాత, దర్శకునిగా తన సేవల్నీ అందించాడు.
2015లో దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం రాజకీయ పార్టీ వ్యవస్థాపించారు. ఇక ప్రస్తుతం ఈ పార్టీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు ఈ హీరో. విజయ్ కాంత్ కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత తమిళ్ లో ఎన్నో వందల కొద్ది సినిమాలు చేశారు విజయ్ కాంత్. కాగా ఆయన మృతి తమిళ సినిమా ఇండస్ట్రీలో అలానే రాజకీయాల్లో తీరని లోటును మిగిల్చింది.
Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
Also Read: Corona Jn.1 Precautions: దేశంలో కరోనా కొత్త వేరియంట్ భయం, లక్షణాలెలా ఉంటాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter