Prabhas Food To Team ప్రభాస్‌తో పని చేసిన ప్రతీ ఒక్కరూ ఆయన ఆతిథ్యం గురించి మాట్లాడతారు. అది బాలీవుడ్ నుంచి వచ్చిన వారైనా ఇతర ఇండస్ట్రీల నుంచి వచ్చిన వారైనా సరే.. ప్రభాస్ ఆతిథ్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఇక ప్రాజెక్ట్ కే సినిమా కోసం అమితాబ్, దీపిక పదుకొణె, దిశా పటానీలు వచ్చినా కూడా ఆతిథ్యంతో ఉక్కిరి బిక్కిరి చేశాడు ప్రభాస్. ఆయన ఇంటి నుంచి వచ్చిన యాభై రకాల వంటకాలను చూసి వారంతా నోరెళ్లబెట్టారు.
ఇక సలార్ సెట్లో శ్రుతి హాసన్ అయితే ప్రభాస్ పెట్టిన డిషెస్ గురించి చెప్పి ఎంతో ఎగ్జైట్ అయింది. ఇన్ని రకాల వంటలను తీసుకొచ్చాడంటూ ప్రభాస్ గురించి చెప్పింది శ్రుతి హాసన్. ఇప్పుడు తమన్నా కూడా ప్రభాస్ గొప్ప మనసు గురించి చెప్పుకొచ్చింది. ప్రభాస్‌లా అతిథులను గొప్పగా చూసుకునే వారు ఎవ్వరూ ఉండరు.. అది యూనివర్సల్ అంటూ పొగిడేసింది.
ముప్పై రకాల వంటకాలే కదా? అదే ముంది.. దాంట్లో పోయేది ఏముంది.. డబ్బులేం ఖర్చవుతాయ్ అని ప్రభాస్ అనుకుని ఉండొచ్చు. కానీ ఎదుటి వారికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు.. ఎంత స్పెషల్‌గా ట్రీట్ చేస్తున్నాడనేది గొప్ప విషయం అని ప్రభాస్‌ను ఆకాశానికి ఎత్తేసింది. ఆ విషయాలే ప్రభాస్‌ను నిజంగా రాజు అనిపించేలా చేస్తుంది అని తమన్నా పొగిడేసింది.
తన చుట్టూ ఉన్న జనాల మీద ప్రభాస్ ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాడో ఆయనకు తెలియదు.. ఆయన తన స్థాయిని కూడా పట్టించుకోరు అని ప్రభాస్ గురించి తమన్నా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమన్నా చివరగా బబ్లీ బౌన్సర్ అంటూ ఓటీటీలో జనాలను పలకరించింది. కానీ ఈ సినిమా అంతగా హిట్ అవ్వలేదు.
తమన్నాకు తెలుగులో హిట్ వచ్చి చాలా కాలమే అయింది. గుర్తుందా శీతాకాలం అనే సినిమాతోనూ తమన్నా ఆడియెన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేసింది. కానీ అది కూడా కుదర్లేదు. తమన్నా నెగెటివ్ రోల్ చేసిన మాస్ట్రో సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి.
Also Read: Samantha Ruth Prabhu on Rana : ఆగలేకపోతోన్నా!.. వెంకీమామా, రానాలపై సమంత ప్రేమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook