Drugs: కరోనాకాలంలో ఆరకేజి డ్రగ్స్ కొన్న రియా, సుశాంత్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant Singh Rajput ) ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. సీబిఐ, ఈడితో కలిసి ఈ కేసులో డ్రగ్స్ కోణాన్ని తవ్వి తీస్తోన్న నార్కోటిక్స్ క్రైమ్ బ్యూరో (NCB) కొత్త కొత్త విషయాలను కనుక్కుంటోంది.

Last Updated : Sep 12, 2020, 03:56 PM IST
    • సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant Singh Rajput ) ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది.
    • సీబిఐ, ఈడితో కలిసి ఈ కేసులో డ్రగ్స్ కోణాన్ని తవ్వి తీస్తోన్న నార్కోటిక్స్ క్రైమ్ బ్యూరో (NCB) కొత్త కొత్త విషయాలను కనుక్కుంటోంది.
    • కరోనావైరస్ ( Coronavirus ) వల్ల దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ సమయంలో సుశాంత్ కొంత కాలం రియా అపార్ట్ మెంట్ లో ఉన్నాడట
Drugs: కరోనాకాలంలో ఆరకేజి డ్రగ్స్ కొన్న రియా, సుశాంత్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant Singh Rajput ) ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. సీబిఐ, ఈడితో కలిసి ఈ కేసులో డ్రగ్స్ కోణాన్ని తవ్వి తీస్తోన్న నార్కోటిక్స్ క్రైమ్ బ్యూరో (NCB) కొత్త కొత్త విషయాలను కనుక్కుంటోంది. కరోనావైరస్ ( Coronavirus ) వల్ల దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ సమయంలో సుశాంత్ కొంత కాలం రియా అపార్ట్ మెంట్ లో ఉన్నాడట. ఆ సమయంలో వారిద్దరూ కలిసి సీక్రెట్ గా మరిజువానా ( ఒక రకమైన మత్తు పదార్థం ) కొనుగోలు చేశారు. అయితే డిలవరీ ఇబ్బందులు తలెత్తకుండా కొత్తగా ఆలోచించి ఒక కొరియర్ సర్వీసునే వాడుకున్నారట. ఈ కొరియర్ సంస్థ వారికి కావాల్సిన నిత్యావసరాలతో పాటు ఒక బాక్సు మత్తు పదార్థాలను కూడా సప్లై చేసిందని నార్కోటిక్స్ దర్యాప్తులో తేలింది.

నార్కోటిక్స్ క్రైమ్ బ్యూరో దర్యాప్తులో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపట్డాయి. మారిజువానా డిలవరీ కోసం సుశాంత్ ఇంట్లో వంట మనిషిగా పని చేసే దీపేష్ సావంత్ ( Deepesh Sawant ) మంచి స్కెచ్ వేశాడట. దాంతో మారిజువానా టైమ్ కి వారికి డిలవరీ అయిందట. దీనికి రియా  సోదరుడు షౌవిక్ చక్రవర్తి రిసీవ్ చేసుకున్నాడట.

నార్కోటిక్స్ అధికారుల ముంతు తను డ్రగ్స్ తీసుకున్నట్టు అంగీకరించిన రియా ( Rhea Chakraborty ).. దాన్ని సుశాంత్ కోసం తెప్పించినట్టు తెలిపింది.  అలాగే పలు సార్లు ఇతర ప్రదేశాల్లో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా  డ్రగ్స్ సప్లై చేసినట్టు తెలిపింది. ఇందులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preet Singh ) పేరు కూడా ఉంది.

Trending News