Suriya donates: 5 కోట్ల విరాళం ప్రకటన.. 1.5 కోట్లు అందజేత

కరోనా సంక్షోభంలో ( Coronavirus crisis ) సినీ పరిశ్రమకి, సినీ కార్మికులకు అండగా నిలిచేందుకు ప్రముఖ స్టార్ హీరో సూర్య రూ. 5 కోట్లు విరాళం ప్రకటించాడు. ‘ఆకాశం నీ హద్దురా’ని ( Aakasham nee haddhu ra ) ఒటిటిలో విడుదల చేయబోతున్న సూర్య.. అందులో నుంచి వచ్చిన ఆదాయంలోంచే ఈ డబ్బును విరాళంగా ఇస్తున్నట్టు తెలిపాడు.

Last Updated : Aug 29, 2020, 03:15 AM IST
Suriya donates: 5 కోట్ల విరాళం ప్రకటన.. 1.5 కోట్లు అందజేత

కరోనా సంక్షోభంలో ( Coronavirus crisis ) సినీ పరిశ్రమకి, సినీ కార్మికులకు అండగా నిలిచేందుకు ప్రముఖ స్టార్ హీరో సూర్య రూ. 5 కోట్లు విరాళం ప్రకటించాడు. తన తదుపరి చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ని ( Aakasham nee haddhu ra ) ఒటిటిలో విడుదల చేయబోతున్న సూర్య.. అందులో నుంచి వచ్చిన ఆదాయంలోంచే ఈ డబ్బును విరాళంగా ఇస్తున్నట్టు తెలిపాడు. Also read : Vakeel Saab updates: వకీల్ సాబ్ టీజర్‌కి సమానంగా మోషన్ పోస్టర్

ముందు ప్రకటించిన రూ. 5 కోట్లలో, మొదటి విడతగా సూర్య శుక్రవారం నాడు 1.5 కోట్ల రూపాయలను తమిళ నటులు, నిర్మాతలు, దర్శకులకు చెందిన సంఘాలకు అందజేశారు. Also read : Love story: కరోనా రాకుండా లవ్ స్టోరీ యూనిట్ సరికొత్త ఐడియా

Aakasham nee haddhu ra సినిమా అక్టోబర్ 30న ప్రసారం కాబోతోంది. కరోనా కారణంగా ఆకాశం నీ హద్దురా సినిమా థియేటర్‌లో విడుదలకు నోచుకోలేదు. 6 నెలల నుంచి థియేటర్స్ మూతపడి ఉండటంతో ఇక చేసేదేం లేక సూర్య ఈ సినిమాని ఓటిటిలో విడుదల చేయడానికి ముందడుగు వేశాడు. కానీ తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ విషయంపై స్పందించిన సూర్య.. ఒటిటి ప్లాట్‌ఫాంపై విడుదల చేయడం తప్ప తనకు వేరే మార్గం లేదని, కాకపొతే తన తరువాత సినిమాలను మాత్రం తప్పకుండా థియేటర్లలోనే విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. Also read : Pushpa story: 'పుష్ప కథ కాపీ' ఆరోపణలపై సుకుమార్ వెర్షన్

ఆకాశం నీ హద్దురా సినిమాని గురు ఫేమ్ సుధా కొంగర ( Sudha Kongara ) డైరెక్ట్ చేయగా.. సూర్య తన సొంత బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఎయిర్ డెక్కన్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపీనాథ్ ( GR Gopinath real story ) జీవితం ఆధారంగా తెరకెక్కించారు. Also read : Chiranjeevi: చిరు పాటతో ఆయన్నే ఇంప్రెస్ చేసిన నటుడు

Trending News