Pelli SandaD: రేపే ‘పెళ్లి సందD’ ట్రైలర్...రిలీజ్ చేయనున్న సూపర్ స్టార్

Pelli SandaD:  మరోసారి తెలుగు తెరపై పెళ్లి సందడి మ్యాజిక్ రిపీట్ కాబోతోంది.  25 ఏళ్ల  కిందట దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు రూపొందించిన పెళ్లి సందడి మూవీ తెలుగు సినీ చరిత్రలో పలు రికార్డ్స్ ను నమోదు చేసింది.  తాజాగా శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా మోడ్రన్ 'పెళ్లి సందD'కి శ్రీకారం చుట్టారు రాఘవేంద్ర రావు. ఈ మూవీ ట్రైలర్ రేపు సూపర్ స్టార్ మహేశ్ చేతుల మీదుగా రిలీజ్ కానుంది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 21, 2021, 03:49 PM IST
  • రాఘవేంద్రుడి పర్యవేక్షణలో 'పెళ్లి సందD'
  • హీరోహీరోయిన్లుగా రోషన్, శ్రీలీల
  • ట్రైలర్ రిలీజ్ చేయబోతున్న మహేష్ బాబు
Pelli SandaD:  రేపే ‘పెళ్లి సందD’ ట్రైలర్...రిలీజ్ చేయనున్న సూపర్ స్టార్

Pelli SandaD: హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్(Roshan) నటిస్తున్న తాజా చిత్రం పెళ్లి సందడి. ఈ సినిమాలో శ్రీలీల(sri leela ) హీరోయిన్‌గా నటిస్తోంది. రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తుండగా… కృష్ణమోహన్ రావు సమర్పణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా గత పెళ్లి సందడి చిత్రానికి సీక్వెల్ కాదని ఇప్పటికే ప్రకటించింది చిత్రయూనిట్. 

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, పోసాని కృష్మ మురళి, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకా,ల అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. వీరితోపాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. 

Also read: Bheemla Nayak Blitz: భీమ్లా నాయక్.. డానియల్ శేఖర్‌ వచ్చేశాడు.. నేనెవరో తెలుసా? హీరో అంటూ పవర్​ఫుల్ డైలాగ్‌తో అదరగొట్టిన రానా

ఇటీవల అక్కినేని నాగార్జున చేతులమీదుగా 'పెళ్లి సందD' టీజర్ రిలీజ్ చేయగా.. తెలుగు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. రేపు ( 22న )ఉదయం 11 గంటలకు సూపర్ స్టార్ మహేశ్ బాబు(Superstar Mahesh babu) చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్ చేయించనున్నారు. ‘పెళ్లి సందడి’(Pelli Sandadi Movie) సినిమాకి పనిచేసిన కీరవాణి – చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం. పాతికేళ్ళ క్రితం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్ళిసందడి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ పాటలు శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి(MM Keeravani) సంగీతాన్ని ఇందించారు. ఈ సూపర్ హిట్ సినిమా ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా రోషన్ కు ఎంతటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News