Super Star Krishna Death : సూపర్ స్టార్ కృష్ణ మరణం.. బాధపడాల్సిన అవసరం లేదన్న వర్మ

RGV Condolence to Krishna సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కృష్ణ మరణం మీద స్పందించాడు. ఆయన మరణించినందుకు బాధపడాల్సిన అవసరం లేదన్నట్టుగా ట్వీట్ వేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2022, 09:36 AM IST
  • కన్నుమూసిన సూపర్ స్టార్ కృష్ణ
  • దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన టాలీవుడ్
  • కృష్ణ మీద రామ్ గోపాల్ వర్మ ట్వీట్
Super Star Krishna Death : సూపర్ స్టార్ కృష్ణ మరణం.. బాధపడాల్సిన అవసరం లేదన్న వర్మ

RGV Jr NTR Pawan Kalyan NBK Chiranjeevi Condolence to Krishna Death : సూపర్ స్టార్ కృష్ణ (80) మంగళవారం ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. సోమవారం అంతా కూడా కృష్ణకు చికిత్స అందిస్తూనే ఉన్నారు. ఈ మేరకు కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు ఇచ్చిన ప్రకటన అందరికీ తెలిసిందే. గుండెపోటుతో ఆయన ఆస్పత్రిలో జాయిన్ అయ్యారని, ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ చెప్పలేమని వైద్యులు అన్నారు.. కండీషన్ చాలా క్రిటికల్‌గా ఉందంటూ వైద్యులు నిన్న ప్రకటించారు. కృష్ణ చికిత్స పొందుతూనే నేటి ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగింది.

కృష్ణ మరణం పట్ల సినీ ప్రముఖులంతా కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి స్పందిస్తూ.. మాటలకు అందని విషాదమిదని బాధపడ్డారు. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదని ఎమోషనల్ అయ్యాడు. మంచి మనసు కలిగిని హిమాలయ పర్వతం, సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయపదం అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు.

నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ.. తెలుగు సినీ వినీలాకాశంలో మరో ధృవతార చేరిందని అన్నారు. నటనలో కిరీటి, సాహసానికే మారుపేరు, సాంకేతికతలో అసాధ్యుడు, స్వయంకృషితో ఎదిగిన సూపర్ స్టార్, అపర దానకర్ణుడు.. ఘట్టమనేని కృష్ణ.. అంటూ సంతాపాన్ని వ్యక్తం చేశాడు. తెలుగులో కౌబాయ్ సినిమాలకు ఆద్యుడు, గూఢచారి( సీక్రెట్ ఏజెంట్ ) సినిమాల్లో ఘనాపాఠి, సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రల్లో ఘనాపాఠి. వర్ధమాన నటులకు, కళాకారులకు ఆదర్శప్రాయుడు కృష్ణ.. ఆయనలేని లోటు తీర్చలేనిది.. అంటూ బాలయ్య ఎమోషనల్ అయ్యాడు.

కృష్ణ మృతి పట్ల ఎన్టీఆర్ స్పందిస్తూ.. 'కృష్ణ గారు అంటే సాహసానికి మరో పేరు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా, సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు  పరిచయం చేసిన మీ ఘనత ఎప్పటికి చిరస్మరణీయం.' అంటూ పేర్కొన్నారు. మహేష్ అన్నకు, ఫ్యామిలీకి, ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి అని ఎన్టీఆర్ తెలిపారు.

సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ స్పందిస్తూ తన స్టైల్లో సంతాపాన్ని వ్యక్తం చేశాడు. 'ఆయన మరణించాడని మనం ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు..  నాకు తెలిసి విజయ నిర్మల గారు, కృష్ణ గారు స్వర్గంలో పాటలు పాడుతూ, డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు' అని అన్నాడు.

Also Read : Krishna And SPB Controversy : సూపర్ స్టార్ కృష్ణకు ఎస్పీబీకి మధ్య దూరం.. లోలోపల ఇంత జరిగిందా?..  రెమ్యూనరేషన్‌పై గొడవ

Also Read : Super Star Krishna Last Video Audio : సూపర్ స్టార్ కృష్ణ చివరి వీడియో ఇదే.. అందులో ఏం మాట్లాడారంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News