Anasuya Aunty Controversy: పాపం అనసూయకు వరుస కష్టాలు.. ఆంటీ వివాదంతో మూడు అవకాశాలు గాయబ్!

Sukumar To Remove Anasuya Bharadwaj From Pushpa 2 Regarding 'aunty' Controversy:  ఆంటీ వివాదంతో వార్తల్లోకి ఎక్కిన అనసూయ అనూహ్యంగా చిక్కుల్లో పడినట్టు చెబుతున్నారు. పుష్ప సహా మరో రెండు సినిమాల నుంచి ఆమెను తప్పించారాట. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 30, 2022, 04:26 PM IST
Anasuya Aunty Controversy: పాపం అనసూయకు వరుస కష్టాలు.. ఆంటీ వివాదంతో మూడు అవకాశాలు గాయబ్!

Sukumar To Remove Anasuya Bharadwaj From Pushpa 2 Regarding 'aunty' Controversy: లైగర్ సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఆ సినిమాని పరోక్షంగా కామెంట్ చేస్తూ అనసూయ చేసిన ట్వీట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ మీద ఎప్పటి నుంచో కోపం పెంచుకున్న అనసూయ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో అమ్మని అన్న ఉసురు ఊరికే పోదని కామెంట్లు చేసింది. అసలే సినిమా పోయి బాధలో ఉన్నామని భావించిన అభిమానులు అనసూయను టార్గెట్ చేసి కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

ఈ దెబ్బతో అనసూయ కూడా రెచ్చిపోయి ఆంటీ అన్న వారి మీద కేసు పెడతా అక్క అన్న వారిని ఊరుకోను అంటూ సోషల్ మీడియాలో కలకలం రేపింది. అంతేకాక ఆమెను దుర్భాషలాడుతూ ఎవరు ట్వీట్ చేస్తే వెంటనే ఆ ట్వీట్ రీ ట్వీట్ చేస్తూ రెండు రోజులపాటు సోషల్ మీడియాలో హల్చల్ సృష్టించింది. అంతే కాదు  ఆమె అక్కడితో ఆగకుండా చెప్పిన విధంగానే ఆంటీ అన్న వాళ్ళ అందరి మీద కేసులు కూడా పెట్టిందట. అయితే సాధారణంగా ఇలాంటి వివాదాలు తలనొప్పి తీసుకురావడమే గాక ఉన్న అవకాశాలను కూడా తీసుకు పోవడం ఖాయం అని తేలింది.

అనసూయ ఈ వివాదంలో చిక్కుకున్న నేపథ్యంలో కొన్ని వారాల క్రితం అనసూయ సైన్ చేసిన ఒక సినిమా నుంచి అనసూయను తొలగిస్తున్నట్లు సదరు సినిమా నిర్మాత నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే అనసూయ పుష్ప అనే సినిమాలో దాక్షాయని అనే పాత్రలో నటించి మంచి హిట్ కూడా అందుకుంది. రెండో భాగంలో కూడా ఆమె పాత్ర హైలెట్ అవ్వబోతుందని అందరూ భావించారు. ఈ వివాదం కారణంగా అనసూయకు పుష్ప సినిమా ఆఫర్ కూడా మిస్ అయింది అని తెలుస్తోంది.

అనసూయ స్థానంలో ఒక మేల్ విలన్ నే తీసుకోవడానికి సుకుమార్ ఆసక్తి చూపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమాలే కాదు అనసూయ నటిస్తున్న మరో సినిమా యూనిట్ కూడా ఈ కారణంగానే ఆమెను సినిమా నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. అర్జున్ రెడ్డి వివాదం జరిగి చాలా రోజులే అయినా, ఆ తర్వాత విజయ్ దేవరకొండ నిర్మించిన సినిమాలో అనసూయను ఒక పాత్రలో నటింప చేసినా ఆమె ఇంకా పగను మనసులో పెట్టుకుని ఇలా దెప్పి పొడుస్తూ ట్వీట్ చేయడం కరెక్ట్ కాదని సదరు నిర్మాతలు భావిస్తున్నారట. రేపు ఇదే పరిస్థితి మనకు ఎదురు కాదని గ్యారెంటీ ఏమిటని వారంతా భావిస్తున్నారట. అయితే ఇవి కాక అనసూయ రెండు తమిళ సినిమాలు, ఒక మలయాళ సినిమా సైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమాల విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.
Also Read: Jalsa Re Release Trailer: సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా జల్సా రీ రిలీజ్ ట్రైలర్.. మహేష్ వాయిస్ ఓవర్ తో రచ్చ!

Also Read: Kamal Rashid Khan Judicial Custody: నోటి దురదకు చెల్లించక తప్పదు మూల్యం.. క్రిటిక్ కేఆర్కే అరెస్ట్.. 14 రోజుల జైలు?

Trending News